Corona Vaccine : అందరికీ వ్యాక్సినేషన్: అవసరం & ముందడుగు...

Corona Vaccine : అందరికీ వ్యాక్సినేషన్: అవసరం & ముందడుగు...

Corona Vaccine : అన్ని వైపరీత్యాల మాదిరిగానే, COVID-19 మహమ్మారికి కూడా అది కలగజేసిన నష్టాలను, ఇబ్బందులను మర్చిపోవడానికి సామూహిక అవగాహన అవసరం. ఒకవేళ మనం ఈ భారాన్ని ఒకరితో ఒకరం పంచుకోకపోతే అది కలగజేస్తున్న భయానక నష్టానికి బలికావాల్సి వస్తుంది. ఇప్పటికే సొంత వాళ్లను కోల్పోయి తీరని శోకాన్ని అనుభవిస్తున్న వారికి, మహమ్మారి సోకి బాధపడుతున్న వారికి చేయూతగా ఉండాల్సిన అవసరం ఉంది.

 • Share this:
  COVID-19 మీద భారతదేశం చేస్తున్న యుద్ధంలో సమయం కీలకపాత్ర పోషిస్తోంది. వ్యాక్సిన్ తయారీ, రవాణా, డెలివరీ విషయంలో ఇది మరింత కీలకంగా మారింది. సామూహిక ఇమ్యూనిటీని కొంచమైనా పొందడానికి వీలుగా పెద్దమొత్తంలో మధ్య వయస్సు భారతీయులు త్వరగా వ్యాక్సినేట్ చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, 18 ఏళ్లు నిండిన అందరు భారతీయులకు వ్యాక్సినేషన్ ఇచ్చే ఉద్దేశంతో మే 1న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో తమ రాష్ట్రంలోని 45 – 60 వయస్సులో ఉన్న లక్షల మందికి వ్యాక్సిన్ అందించలేకపోయాయి. ఈ కారణంగా కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే అర్హులైన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ అమలును పొడిగించాయి.

  ఎంతోమంది కొత్త యూజర్‌లు CoWin రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో అవుటేజ్ తలెత్తిన కారణంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా మందకొడిగా మొదలైంది. ఆ సమస్య తీరిన తర్వాత, వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు తమ ఏరియా పిన్‌కోడ్ ద్వారా వారికి వీలైన వ్యాక్సినేషన్ స్లాట్‌ను నేరుగా రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారి డేటా ప్రకారం మే 4వ తేదీ నాటికి, about 600,000 people in the 18 – 44 వయస్సు గ్రూపులో దాదాపుగా 6,00,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వయస్సు గ్రూపులో ఎక్కువ వ్యాక్సిన్లు అందజేసిన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. కానీ భారతదేశంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చాలా కృషి చేయాల్సి ఉంది.

  అన్నిటికన్నా ముందుగా, టార్గెట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కరోనా బారిన పడి ఇన్‌ఫెక్షన్ హాట్‌స్పాట్‌లుగా మారిన మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ లాంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ డోసుల కోసం చూస్తున్నాయి. ఈ రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాంటి రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకు త్వరగా అవగాహన కల్పించి వీలైనంత త్వరగా COVID-19 నుండి ఇమ్యూనిటీని అందించాలి. భారతదేశంలో వ్యాక్సిన్ తయారీదారులైన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు తమ కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ రెండింటితో పాటుగా రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా ఇటీవల భారతదేశంలో వాడటానికి ఆమోదం పొందినది. ఇక ఇప్పుడు సరైనా లాజిస్టిక్స్, సప్లయ్ చెయిన్ విధానాల ద్వారా అత్యవసరమైన వారికి ఈ వ్యాక్సిన్ డెలివరీ చేయడమే మన ముందున్న కర్తవ్యం.

  ఇలాంటి అన్ని వైపరీత్యాల మాదిరిగానే, COVID-19 మహమ్మారికి కూడా అది కలగజేసిన నష్టాలను, ఇబ్బందులను మర్చిపోవడానికి సామూహిక అవగాహన అవసరం. ఒకవేళ మనం ఈ భారాన్ని ఒకరితో ఒకరం పంచుకోకపోతే అది కలగజేస్తున్న భయానక నష్టానికి బలికావాల్సి వస్తుంది. ఇప్పటికే సొంత వాళ్లను కోల్పోయి తీరని శోకాన్ని అనుభవిస్తున్న వారికి, మహమ్మారి సోకి బాధపడుతున్న వారికి చేయూతగా ఉండాల్సిన అవసరం ఉంది.

  Network18 Sanjeevani – A Shot Of Life, Federal Bank వారి CSR కార్యక్రమంతో మేము మా వంతు సాయం చేస్తున్నాము, భారతదేశంలో COVID-19కు వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తున్న అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇది. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని ఫాలో చేసి, భారతదేశాన్ని ఆరోగ్యంగా, వ్యాధినిరోధకంగా చేయడానికి స్టాండ్ తీసుకోండి.
  Published by:Sridhar Reddy
  First published: