Home /News /coronavirus-latest-news /

WHAT IS THE PUNISHMENT FOR CM YS JAGAN FOR NEGLECTING IN CONTAINING COVID 19 ASKS NARA LOKESH BA

వారిని సస్పెండ్ చేస్తే... మరి ఆ తప్పు చేసిన జగన్‌కు ఏ శిక్ష వేయాలి?: నారా లోకేష్

నారా లోకేష్

నారా లోకేష్

ఇద్దరు అధికారులపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు సరైన వైద్య పరికరాలే లేవంటూ ఆరోపించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం వేటు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తప్పు పట్టారు. ప్రభుత్వం వద్ద సరైన మాస్క్‌లు లేవంటూ ఆరోపించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ప్రభుత్వం నుంచి తమకు కనీసం రూపాయి నిధులు కూడా రాలేదన్నారు. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే తమను ఆదుకుంటున్నారని చెప్పారు. దీంతో ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా నగరి వదిలి వెళ్లకూడదని చెప్పింది. ఈ ఇద్దరినీ సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన నారా లోకేష్, వెంటనే ఆ ఇద్దరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.



    ‘కరోనా ని ఎలా నివారించాలి అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డి ని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికల ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలి?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. ‘జగన్ అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకింది. డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చింది.’ అని లోకేష్ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు