ప్రస్తుతం దక్షిణాప్రికాలో SARS CoV 2 కొత్త రూపాంతరం చెంది వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది అత్యంత ఆందోళనకరమైన వేరియంట్ గా వర్గీకరించింది. దీనిపై ప్రపంచదేశాలు జాగ్రతగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరించింది. అయితే దీనికి ‘ఓమిక్రాన్’ అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక దీనిపై ముఖ్యమైన దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఆరోగ్య సంస్థ హెచ్చిరించిన వెంటనే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించేందకు సిద్ధం అయ్యాయి. ఇక ఈ ఓబిక్రాన్ అనే కత్త వేరియంట్ గత వారం దక్షిణాఫ్రికాలో కనిపించింది. దీనిని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ ఈ వేరియంట్ ను గుర్తించింది. ఇది B.1.1.529 అనే వంశానికి చెందిన సంబంధిత SARS CoV 2 వైరస్‌ల సమూహాన్ని గుర్తించింది.
ఇక దీని యొక్క వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని.. డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు.. నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అనేది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా సోకడంతో ఆందోళన ఇంకాస్త పెరిగింది. ఇక దక్షిణాప్రికా దేశంలోని అత్యధిక జనాభా కలిగిన పట్టణం గౌటెంగ్. ఇక్కడ అంటువ్యాధి కేసులు పెరగడానికి కారణం ఈ కొత్త వేరియంట్ అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే ఈ కొత్త వేరియంట్ ఎక్కడ నుంచి వచ్చిందో స్పష్టత మాత్రం లేదు. దక్షిణాఫ్రికాలోని శాస్త్రవేత్తలచే ఇది మొదటిసారిగా గుర్తించబడింది. బోట్స్వానా, హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఈ వేరియంట్ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. Omicron అనే పదం గ్రీకు వర్ణమాల నుండి వచ్చింది.
డెల్టా వంటి కొన్ని బాగా తెలిసిన వేరియంట్‌లు ఆందోళనకు దారితీశాయి. ఆ వర్గంలోని ఇతరులకు ఆల్ఫా, బీటా మరియు గామా అని పేరు పెట్టారు. వీటిలో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓమిక్రాన్ అనే పేరు పెట్టారు. మొదటి కేసు ధృవీకరించబడిన నమూనా నవంబర్ 9న తీసుకున్నట్లు WHO తెలిపింది. ఇప్పుడు బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్‌తో పాటు దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణికులలో ఓమిక్రాన్ కేసులు కనిపిస్తున్నాయి.
ఇక దీనిపై సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ అయిన డాక్టర్ ఏంజెలా రాస్ముస్సేన్ మాట్లాడుతూ.. గ్రీకు నామకరణ విధానాన్ని ప్రకటించకముందే, ఈ సంవత్సరం తాను విలేకరులతో చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని అన్నారు. B.1.1.7 మరియు B.1.351 వేరియంట్‌ల గురించి తాను గందరగోళానికి గురయ్యానన్నారు. అయితే దీనిని ప్రజలు UK వేరియంట్ లేదా దక్షిణాఫ్రికా వేరియంట్ అని పిలుస్తున్నారన్నారు. ఇలాంటి వైరస్ పేర్లను అవి పుట్టే ప్రదేశాన్ని బట్టి ప్రకటిస్తారు. మొదట దీనిని స్పానీష్ ఫ్టూ అని పిలిచేవారన్నారు. ఇక దీనిపై.. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని పలు దేశాలు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశాయి.
ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid -19 pandemic, Covid cases