ఈ కాంబినేషన్‌లో మందులు వాడితే కరోనా ఔట్... శాస్త్రవేత్తల తాజా సలహా...

కరోనాకి రెమ్‌డెసివిర్ బాగా పనిచేస్తోందని అందరూ చెబుతున్నారు. ఐతే... కరోనాను జయించాలంటే అదొక్కటీ చాలదంటున్న శాస్త్రవేత్తలు ఓ కాంబినేషన్ తెరపైకి తెచ్చారు.

news18-telugu
Updated: July 5, 2020, 7:34 AM IST
ఈ కాంబినేషన్‌లో మందులు వాడితే కరోనా ఔట్... శాస్త్రవేత్తల తాజా సలహా...
ఈ కాంబినేషన్‌లో మందులు వాడితే కరోనా ఔట్... (credit - twitter - Reuters)
  • Share this:
ఎవరికైనా కరోనా సోకితే... ఏ మందులు వాడాలో డాక్టర్లు చెబుతున్నారు. ఐతే... కరోనాకి మాగ్జిమం షాక్ ఇవ్వాలంటే... యాంటీవైరల్ మాత్ర... రెమ్‌డెసివిర్ (remdesivir) చాలదు. మరికొన్ని రకాల మందుల్ని కలిపి వాడాలంటున్నారు అమెరికా పరిశోధకులు. యాంటీ-ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్‌గా పిలిచే... బారిసిటినిబ్ (baricitinib)ని కూడా వాడాలంటున్నారు. దీన్ని జనరల్‌గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు వాడుతున్నారు. నెల రోజులుగా ఈ కాంబినేషన్‌లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌తో మరో రూమటాయిడ్ ఆర్థరైటిస్‌కి టాబ్లెట్ అయిన టోసిలీజుమాబ్ (tocilizumab) కూడా కలిపి వాడొచ్చని గిలీడ్ సైసెన్స్ సంస్థ చెబుతోంది. ఈ మందును అక్టెమ్రా (Actemra) పేరుతో అమ్ముతున్నారు.

రెమ్‌డెసివిర్‌తో... మరో మూడు, నాలుగు రకాల మందులను కలిపి వాడాలంటున్నారు శాస్త్రవేత్తలు. తద్వారా... వైరస్‌కి చెక్ పెట్టడమే కాక.. బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చంటున్నారు. అలాగే... జ్వరం తగ్గేందుకు... కూడా అవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

Convalescent plasma : కన్వాలెసెంట్ ప్లాస్మా కూడా ఇందుకు పనికొస్తుందని చెబుతున్నారు. ఈ ప్లాస్మాను... కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి సేకరిస్తున్నారు. దీనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికాలో ఇప్పటికే 25వేల మంది ప్లాస్మా ఇచ్చారు. ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల్లో ప్లాస్మా ట్రీట్‌మెంట్‌తో కరోనా పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారు. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (Operation Warp Speed) విధానం ద్వారా అమెరికా... ప్లాస్మాను ఏడాది పాటూ స్టోర్ చేసేలా నిర్మాణాలు చేపట్టింది.

కామన్ స్టెరాయిడ్ డెక్సామెథసోన్ (dexamethasone) కూడా కరోనా మరణాల్ని మూ‌డొంతుల వరకూ ఆపగలుగుతోందని ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

రెమ్‌డెసివిర్ వాడకం బాగా పెరగడంతో... దాన్ని త్వరలోనే ఇన్హేలర్ రూపంలోకి తేవాలని డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. తద్వారా... ప్రజలు ఎక్కడున్నా... ఈజీగా దాన్ని పీల్చుతూ... కరోనాకు చెక్ పెట్టవచ్చంటున్నారు.

గమనిక : పై వివరాలు పరిశోధకులు చెప్పినవి మాత్రమే. పై మందులను ప్రజలు వ్యక్తిగతంగా వాడకూడదు. డాక్టర్ల సలహాలు, సూచనలు, పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 7:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading