మళ్లీ లాక్ డౌన్?... ఏ రాష్ట్రాలు ఏమంటున్నాయి... కేంద్రం ఆలోచన ఏంటి?

కేంద్రం విధించిన లాక్‌డౌన్-5 జూన్ 30తో ముగియనుంది. మరి రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగించాలంటున్నాయా? కేంద్రం అభిప్రాయం ఎలా ఉంది?

news18-telugu
Updated: June 29, 2020, 10:01 AM IST
మళ్లీ లాక్ డౌన్?... ఏ రాష్ట్రాలు ఏమంటున్నాయి... కేంద్రం ఆలోచన ఏంటి?
మళ్లీ లాక్ డౌన్?... ఏ రాష్ట్రాలు ఏమంటున్నాయి... కేంద్రం ఆలోచన ఏంటి?
  • Share this:
దేశంలో లాక్‌డౌన్-3 వరకూ... పెద్దగా మినహాయింపులు లేవు. అందువల్ల ప్రజలు లాక్‌డౌన్ అనేదాన్ని చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. లాక్‌డౌన్-4, 5లో నిబంధనల్ని చాలా వరకూ సడలించడంతో... ఇప్పడు దాదాపు లాక్‌డౌన్ లేని పరిస్థితే కనిపిస్తోంది. మరి... ఐదో లాక్‌డౌన్ జూన్ 30తో ముగుస్తున్న తరుణంలో... ఈమధ్య ప్రధాని నరేంద్ర మోదీ... ఇక లాక్‌డౌన్ ఉండదని... అన్‌లాక్-1 ప్రారంభమైందని... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అన్నారు. అంటే... జూన్ 30 తర్వాత అన్‌లాక్-2 ప్రారంభమైనట్లే అనుకోవచ్చు. అంటే ఇక లాక్‌డౌన్ లేనట్లేనా అన్న ప్రశ్నకు లేదన్నదే కేంద్రం నుంచి సమాధానంగా భావించవచ్చు.

రాష్ట్రాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మళ్లీ రెండు వారాలు లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కారణం హైదరాబాద్‌లో కరోనా కేసులు బాగా పెరిగిపోతుండటమే.

ఏపీ ప్రభుత్వం మాత్రం... కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా తన నిర్ణయాలు తీసుకుంటోంది. కాబట్టి... అక్కడ అన్‌లాక్-2 ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే... కరోనా ఉన్న ఏరియాల్లో కఠిన కండీషన్లు అమలు చేసే ఛాన్స్ ఉంది.

దేశంలోనే ఎక్కువ కేసులు ఉన్న మహారాష్ట్రలో లాక్‌డౌన్ కొనసాగనుంది. ఐతే... ఎంతకాలం కొనసాగించేదీ మహా ప్రభుత్వం చెప్పలేదు. కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమన్న సీఎం ఉద్ధవ్ థాక్రే... అత్యవసర సరుకుల కోసం మాత్రమే ఇళ్లలోంచీ రావాలని ప్రజలను కోరారు.

కర్ణాటకలో ప్రతి ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని డిసైడైంది ప్రభుత్వం. జులై 5 నుంచి ఈ రూల్ అమలవుతుంది. ఆదివారం నాడు నిత్యవసరాలు మాత్రమే లభిస్తాయి. ప్రతి శనివారం ప్రభుత్వ ఆఫీసుల్ని మూసేయాలని కూడా నిర్ణయం తీసుకుంది.

తమిళనాడు ప్రభుత్వం ఐదు జిల్లాల్లో అంటే కాంచీపురం, చెన్నై, చెంగల్ పేట్, తిరువళ్లూరు, మధురైలో లాక్‌డౌన్ పొడిగించబోతోంది. అక్కడ నిత్యవసరాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని చెప్పింది.

బెంగాల్‌లో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఇందుకు ప్రతిపక్షాలు రకరకాలుగా అభిప్రాయం చెప్పినా... సీఎం మమతా బెనర్జీ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లన్నీ జులై 31 వరకూ క్లోజే. ప్రభుత్వ ఆఫీసులు 70 శాతం ఉద్యోగులతోనే పనిచేస్తాయి.మణిపూర్‌లో జులై 15 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతర్ జిల్లాల బస్సుల్ని నడపనుంది. ఇక ఏ ప్రజా రవాణాకూ ఛాన్స్ లేదు.

అసోంలో కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల మరో 15 రోజులు లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఆదివారం సాయంత్రం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఫార్మసీలు, ల్యాబ్‌లు, ఆస్పత్రుల్ని మాత్రమే తెరిపిస్తోంది.

జార్ఖండ్ కూడా జులై 31కి వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. పరిస్థితి ఏం బాలేదని సీఎం తెలిపారు. రాత్రివేళ 9-5 మధ్య కర్ఫ్యూ తప్పనిసరి అన్నారు. కాలేజీలు, థియేటర్లు, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ ఇప్పట్లాగే తెరచుకోవు.

పంజాబ్ ప్రభుత్వం కూడా పరిస్థితిని బట్టీ పొడిగిస్తామని తెలిపింది.

ఇదివరకు రాష్ట్రాలే లాక్‌డౌన్ వద్దని కోరేవి. ఇప్పుడు రాష్ట్రాలే స్వయంగా పొడిగిస్తున్నాయి. అంతెందుకు... ప్రజల్లో కొంత మంది కూడా కరోనాతో ఇబ్బందులు ఎక్కువవుతుండటంతో... బజార్లకు బజార్లు మూసేస్తున్నారు. వ్యాపారాల్ని కూడా త్వరగా ముగించేసుకుంటున్నారు. కరోనా ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా చేస్తోంది.
First published: June 29, 2020, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading