జూలై 31 వరకు లాక్ డౌన్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటన...

ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ బెంగాల్లోని కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Share this:
    జూలై 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జూలై 31 వరకు రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి వీల్లేదు. ట్రైన్లు, మెట్రో సర్వీసులకు కూడా అనుమతి లేదు. దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో విధించిన లాక్ డౌన్ జూన్ 30న ముగుస్తుంది. ఈ క్రమంలో గడువు ముగియడానికి వారం రోజుల ముందే బెంగాల్ ప్రభుత్వం లాక్ డౌన్ కాలాన్ని జూలై 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 14728 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 580 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 4930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగాల్లో నిన్న (ఈనెల 23) ఒక్క రోజే 370 కరోనా కేసులు నమోదయ్యాయి.

    బెంగాల్లో కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజులుగా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్నచర్యలతో పాటు తీసుకోబోయే చర్యల మీద అఖిలపక్ష పార్టీల నేతలతో చర్చించారు. అనంతరం లాక్ డౌన్‌ను జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
    First published: