కరోనా వైరస్‌కి తేనెతో చెక్... ప్రత్యేక మిఠాయి అమ్ముతున్న బెంగాల్ ప్రభుత్వం

మన దేశంలో బెంగాల్ సుందర్బన్ అడవుల్లో లభించే తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి దీదీ ప్రభుత్వం ఆ తేనె తోనే కరోనా అంతు చూస్తామంటోంది.

news18-telugu
Updated: June 29, 2020, 8:08 AM IST
కరోనా వైరస్‌కి తేనెతో చెక్... ప్రత్యేక మిఠాయి అమ్ముతున్న బెంగాల్ ప్రభుత్వం
కరోనా వైరస్‌కి తేనెతో చెక్... ప్రత్యేక మిఠాయి అమ్ముతున్న బెంగాల్ ప్రభుత్వం (credit - twitter)
  • Share this:
రెండు నెలల కిందట బెంగాల్‌లో పెద్దగా కరోనా కేసులే ఉండేవి కావు. మరి ఇప్పుడో 5వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. 6వందల మందికిపైగా చనిపోయారు. మొదట్లో బెంగాల్‌లో కరోనా పెద్దగా లేదులే అనుకున్న కేంద్ర ప్రభుత్వానికి... ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా కరోనా అడ్డాగా మారిందే అనే ఆందోళన ఉంది. ఈమధ్యే కేంద్ర వర్గాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి... స్థానికంగా లభించే సుగంధద్రవ్యాలు, ఇతరత్రా వాటిని ఉపయోగించి... కరోనాకి చెక్ పెట్టేందుకు ప్రయత్నించమని సూచించడంతో... ఒక్కసారిగా దీదీ మైండ్‌లో కొత్త ఆలోచన వచ్చింది.

బెంగాల్ సుందర్బన్ అడవుల్లో తేనెపట్టులు చాలా ఎక్కువ. అత్యంత సహజమైన, అత్యంత శక్తిమంతమైన తేనె అక్కడ లభిస్తోంది. అందులో పోషకాలు మెండుగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని డిసైడైంది. ఏంటంటే... ఆవుపాల ద్వారా లభించే... వెన్నను... స్వచ్ఛమైన తేనెతో కలిపి... తాగమని ప్రభుత్వం చెప్పబోతోంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే... కరోనా వదిలిపోయే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ మిశ్రమంలో తులసి ఆకుల్ని కూడా కలుపుకోమంటోంది. బెంగాల్ పశు సంవర్థక అభివృద్ధి విభాగం... ఇందుకు సెంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.

ప్రభుత్వం తాజాగా పై మూడింటితో కలిపి... "ఆరోగ్య సందేశ్" అనే తీపి పదార్థాన్ని (మిఠాయి) షాపుల్లో అమ్మిస్తోంది. అందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లూ కలపలేదని చెబుతోంది. ఇది తింటే... వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పింది. ఇది కరోనాకి మందు కాదనీ... ప్రజలు తమ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆరోగ్య సందేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అందేలా... పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతోంది దీదీ సర్కార్.
First published: June 29, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading