Covid-19: ఫేస్ మాస్క్ వాడటంలో ఇబ్బందా..? అయితే ఈ అమ్మాయి ఆవిష్కరణను తెలుసుకోండి..

Covid-19: ఫేస్ మాస్క్ వాడటంలో ఇబ్బందా..? అయితే ఈ అమ్మాయి ఆవిష్కరణను తెలుసుకోండి..

కరోనా కారణంగా బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి. అయితే అన్ని వేళలా ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిదికాదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పదే పదే మాస్కు పెట్టుకోవడం వల్ల చెవి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యకు బెంగాల్ అమ్మాయి ఒక అద్భుత పరిష్కారం కనుగొన్నది.

 • News18
 • Last Updated:
 • Share this:
  కోవిడ్–19 మహమ్మారి విజృంభణతో ప్రజల జీవితంలో మాస్క్ ఒక ముఖ్య భాగమైపోయింది. ఫేస్ మాస్క్ లేనిదే బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ముఖానికి వేసుకునే మాస్కులు కరోనా నుంచి రక్షణకు ఉపయోగపడుతున్నప్పటికీ వీటి అతి వినియోగం ఒత్తిడి మరియు చెవి నొప్పికి దారితీస్తుందని చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపింది పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగంటికా బోస్ అనే 17 ఏళ్ల అమ్మాయి. మేమరిలోని విద్యాసాగర్ స్మృతి విద్యామందిర్‌లో 12వ తరగతి చదువుతున్న దిగంటికా బోస్.. ఫేస్ మాస్క్ తో ఇబ్బందులు పడుతున్న వారందరికీ పరిష్కారం చూపడానికి వినూత్నమైన 'ఇయర్ ప్రెజర్ రిడక్షన్ టూల్'ను రూపొందించింది.

  ఆమె చేసిన కృషికి గాను డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం ఇగ్నేటెడ్ మైండ్ చిల్డ్రన్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్–2020ను అందుకుంది. ఈ ఇన్నోవేషన్ పై దిగంటికా బోస్ మాట్లాడుతూ.. ‘‘డాక్టర్లు, హెల్త్ వర్కర్లు మరియు ఇతర అత్యవసర సిబ్బంది నోరు మరియు ముక్కును ఎక్కువ సేపు ఫేస్ మాస్క్‌లతో కప్పబడి ఉంచాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఫేస్ మాస్క్ ను వాడటం వల్ల చెవుల్లో ఒత్తిడి మరియు నొప్పి తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్లాస్టిక్ వంటి సౌకర్యవంతమైన బోర్డు సహాయంతో ఇయర్ ప్రెజర్ రెడెక్షన్ టూల్‌ను రూపొందించాను." అని తెలిపింది.

  ఇన్నోవేషన్ అవార్డ్ లో భాగంగా నిర్వహించిన వార్షిక పోటీల్లో గెలిచిన తొమ్మిది మంది పిల్లలలో ఒకరైన దిగంటికా, ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది. ఈ నూతన ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ నూతన హెడ్ బ్యాండ్ చెవి పట్టీలను కలుపుతూ, వ్యక్తి యొక్క తల వెనుక భాగంలో చుట్టడానికి వీలుగా ఉంటుంది” అని తెలిపింది. దీనితో, చెవులపై ఎటువంటి ఒత్తిడి ఉండదని, ప్రజలు ఇకపై చెవిపోటు వంటి అసౌకర్యాన్ని ఎదుర్కోరని పేర్కొంది. అయితే, దిగంటిగా బోస్ ‘ఇయర్ ప్రెజర్ టూల్’ను మాత్రమే కాకుండా ఇదివరకే కోవిడ్–19కు సంబంధించిన ఐదు ప్రత్యేక పరిశోధనలు మరియు నమూనాలను తయారు చేసింది.

  దీనిలో భాగంగానే దిగంటికా ఏప్రిల్ లో ‘ఎయిర్ ప్రొవైడింగ్ అండ్ వైరస్ డిస్ట్రాయింగ్ మాస్క్’ను కూడా తయారుచేసింది. దీనికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి గుర్తింపు లభించింది. దిగంటికా ఇన్నోవేషన్‌పై ఆమె తండ్రి సుదీప్తా బోస్ మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె ఎప్పుడూ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇన్నోవేషన్ అవార్డు పొందిన తన కుమార్తె పట్ల గర్వంగా ఉంది”అని ఆయన అన్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  అగ్ర కథనాలు