మీరు చనిపోయినా ఇంతే... బీజేపీపై జేడీఎస్ విమర్శలు

కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను ఒక గొయ్య తీసి అందులో పడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

news18-telugu
Updated: July 1, 2020, 9:54 AM IST
మీరు చనిపోయినా ఇంతే... బీజేపీపై జేడీఎస్ విమర్శలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించే విషయంలో ప్రభుత్వాలు, ప్రజలు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను ఒక గొయ్య తీసి అందులో పడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై కర్ణాటకలోని విపక్ష జేడీఎస్ అధికార బీజేపీ తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.



ఈ వీడియోను తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన జేడీఎస్... ఒకవేళ మీరు లేదా మీ కుటుంబసభ్యులు కరోనా కారణంగా చనిపోయినా ఇలాగే గొయ్యి తీసి అందులో మృతదేహాలను పడేస్తారని జేడీఎస్ ఆరోపించింది. కరోనా విషయంలో ప్రభుత్వం ప్రతి రోజూ చెబుతున్న అత్యంత మెరుగైన కోవిడ్ మేనేజ్‌మెంట్ ఇదేనని సెటైర్లు వేసింది.




First published: July 1, 2020, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading