నాయకుడంటే ఇలా ఉండాలి.. కరోనా పేషెంట్‌ను బైక్ మీద ఎక్కించుకుని..

. 43 సంవత్సరాల అమల్ బారిక్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం జార్ గ్రామ్ జిల్లాలోని సొంతూరు సిజు గ్రామానికి వచ్చాడు. అతడికి ఈ మధ్య జ్వరం వచ్చింది.

news18-telugu
Updated: August 13, 2020, 2:20 PM IST
నాయకుడంటే ఇలా ఉండాలి.. కరోనా పేషెంట్‌ను బైక్ మీద ఎక్కించుకుని..
కరోనా బాధితుడిని బైక్ మీద తీసుకుని వెళ్తున్న పట్నాయక్ (Image;Twitter)
  • Share this:
నాయకుడు అంటే ప్రజలు కష్టాలను తన కష్టంగా భావించి వారిని ఆదుకునేవాడు. అలాంటి నిజమైన నాయకులు ఈ రోజుల్లో దొరకడం గగనమే అని చాలా మంది అనే మాట. కానీ, అలాంటి నాయకులు అసలు కనుమరుగైపోలేదు అని అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు రుజువు చేస్తుంటాయి. అసలు విషయానికి వస్తే.. ఓ పల్లెటూరిలో వ్యక్తికి జ్వరం వస్తే.. అది కరోనా వైరస్‌కు ముందు వచ్చే ఫీవర్ అయి ఉంటుందని భావించి అందరూ భయంతో అతడిని దూరం పెట్టారు. కానీ, పొరుగూరిలో ఉండే ఓ యువ నాయకుడు వెంటనే అతడిని తీసుకుని ఆస్పత్రి తీసుకెళ్లాడు. అది కూడా బైక్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్లాడు. పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన జరిగింది. 43 సంవత్సరాల అమల్ బారిక్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం జార్ గ్రామ్ జిల్లాలోని సొంతూరు సిజు గ్రామానికి వచ్చాడు. అతడికి ఈ మధ్య జ్వరం వచ్చింది. అయితే, అతడిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు ఆంబులెన్స్ రాలేదు. ఈ విషయం తెలిసిన పక్కఊరు గోపీబల్లబ్‌పూర్ గ్రామానికి చెందిన సత్యకామ్ పట్నాయక్ వెంటనే తెలిసిన వారి వద్ద ఓ బైక్ అడిగి తీసుకున్నాడు. వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి అక్కడ పీపీఈ కిట్ కొనుగోలు చేశాడు. వైట్ అండ్ వైట్ పీపీఈ కిట్ ధరించి అమల్ బారిక్ నివాసానికి వెళ్లాడు. అతడిని బండి మీద ఎక్కించుకుని 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చాడు. అతడు తీసుకెళ్లింది తక్కువ దూరమే కావొచ్చు. కానీ అతడు చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. సత్యకామ్ పట్నాయక్ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలిసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 13, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading