Coronavirus: కరోనాపై ఫేక్ న్యూస్ నమ్మడంలో వీళ్లు ఫస్ట్

ఈ ఫేక్‌న్యూస్ వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ప్రయత్నాలు వృధా అయ్యే అవకాశం ఉందని నిపుణులు తరచుగా ఆందోళన చెందుతున్నారు.

news18-telugu
Updated: October 15, 2020, 2:55 PM IST
Coronavirus: కరోనాపై ఫేక్ న్యూస్ నమ్మడంలో వీళ్లు ఫస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Fake News on Corona: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ తప్పుడు వార్తలపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఐదు దేశాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకొచ్చాయి. అంకగణితంలో తక్కువ -పరిష్కార సామర్థ్యం ఉన్న వ్యక్తులే కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని సులభంగా విశ్వసించే అవకాశం ఉందని, ప్రజలు తమ అనలిటికల్ ఎబిలిటీలను మెరుగుపరుచుకుంటేనే మహమ్మారిపై వస్తున్న ఫేక్ న్యూస్‌ తగ్గుముఖం పడతాయని అధ్యయనం పేర్కొంది. ఈ సర్వేను ఐర్లాండ్, స్పెయిన్, మెక్సికో, అమెరికా, బ్రిటన్ దేశాల్లో నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న ప్రజలు కరోనాపై వస్తున్న వార్తలపై తొమ్మిది స్టేట్‌మెంట్లు ఇచ్చారు. వాటిలో కొన్ని నిజమైతే, మరికొన్ని తప్పుడు స్టేట్‌మెంట్లు ఉన్నాయి. కోవిడ్–-19 వల్ల 5జి మొబైల్ ఫోన్ యూజర్లకు ఎక్కువగా ప్రమాదం ఉందని సర్వేలో పాల్గొన్న కొంతమంది అభిప్రాయపడితే, మరికొంత మంది డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు.

కోవిడ్–19 పట్ల నకిలీ వార్తల్లో ఎక్కువ భాగం స్వీయనియంత్రణ, టీకాలు వేయడం వంటి వార్తలే ప్రచారంలో ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో తేలిన ఫలితాలను రచయిత డాక్టర్ సాండర్ వాన్ డెర్ లిండెన్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ తప్పుడు వార్తలను నమ్మడానికి రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మలేరియా నిరోధక మందు అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించమే దీనికి పెద్ద ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19పై వస్తున్న నకిలీ వార్తలను విశ్వసించే వారిలో పెద్ద వయసు వారు చాలా తక్కువ అని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్ ప్రచురించింది.

కొందరు రాజకీయ నాయకులు కోవిడ్–19 పట్ల తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో చేరవేస్తున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. అయితే, ఈ ఫేక్ వార్తల ప్రభావం బ్రిటన్, అమెరికాతో పోలిస్తే ఇతర దేశాల్లో ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. దీనిపై కింగ్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఎమ్మా ఓ డ్వైర్ మాట్లాడుతూ ‘ఈ ఐదు దేశాల్లో జరిపిన సర్వేలో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. కాబట్టి మిలిగిన దేశాల్లో కూడా ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయని చెప్పలేం’ అని అన్నారు.

కోవిడ్–19పై ఫేక్ న్యూస్ ఎందుకు ఇంతలా వ్యాపిస్తుందనే దానిపై ఈ జర్నల్ స్పష్టతనివ్వలేదు. ఈ ఫేక్‌న్యూస్ వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ప్రయత్నాలు వృధా అయ్యే అవకాశం ఉందని నిపుణులు తరచుగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాక ఇటువంటి తప్పుడు వార్తలు పాపులర్ పొలిటికల్ లీడర్స్, సోషల్ మీడియా ద్వారా ప్రసారం అవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్లో కార్నెల్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో కోవిడ్–-19పై అపోహలు సృష్టించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే ముందున్నారని తేలింది. కరోనా వైరస్ వ్యాక్సిన్, 5 జీ నెట్వర్క్లను ఉపయోగించి ప్రజలను నియంత్రించే కుట్ర జరుగుతుందని అనేక మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇటువంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసే వారి ఖాతాలపై తాజాగా ఫేస్‌బుక్ నిషేధాన్ని ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 15, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading