కరోనాకు సవాల్... కోటి టెస్టులు చేసిన భారత్... మరిన్ని ఎక్కువ టెస్టులకు ఏర్పాట్లు...

ఒకప్పుడు ఇండియా... కరోనాకు టెస్టులు చేసే పరిస్థితిలోనే లేదు.... ఇప్పుడో ఏకంగా కోటి టెస్టులు చేసి... ప్రపంచ దేశాల్ని ఆశ్చర్య పరుస్తోంది.

news18-telugu
Updated: July 6, 2020, 2:31 PM IST
కరోనాకు సవాల్... కోటి టెస్టులు చేసిన భారత్... మరిన్ని ఎక్కువ టెస్టులకు ఏర్పాట్లు...
కరోనాకు సవాల్... కోటి టెస్టులు చేసిన భారత్... మరిన్ని ఎక్కువ టెస్టులకు ఏర్పాట్లు...
  • Share this:
భారత్‌లో కరోనా టెస్టుల సంఖ్య కోటి దాటింది. జూన్ 6 ఉదయం 11 గంటల సమయానికి ఇండియా 1,00,04,101 టెస్టులు చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)తెలిపింది. తాజాగా నిన్న ఒక్క రోజే 180596 టెస్టులు జరపడంతో... నిన్న రాత్రి నాటికి మొత్తం టెస్టుల సంఖ్య 9969662కి చేరింది. ఇవాళ ఉదయం నుంచి జరిపిన టెస్టులతో ఈ సంఖ్య కోటిని దాటింది. మరిన్ని ఎక్కువ టెస్టులు జరిపే దిశగా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. టెస్టులు జరపడం ద్వారా... ఎక్కువ పాజిటివ్ కేసుల్ని ముందే గుర్తించి... ఐసోలేట్ చేయవచ్చనే ఉద్దేశంతో... ICMR ఈ దిశగా రాష్ట్రాలను ముందుకు నడిపిస్తోంది.


టెస్ట్, ట్రేస్, ట్రీట్ (TTT) అనేది ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) నినాదం. ప్రతీ దేశమూ ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా... కరోనా పేషెంట్లను త్వరగా గుర్తించేందుకు వీలవుతుందనీ... తద్వారా... వాళ్లకు త్వరగా ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా... కరోనాకు చెక్ పెట్టవచ్చని WHO చెబుతోంది. అంతేకాదు... కరోనా చైన్‌ను బ్రేక్ చెయ్యాలంటే... కరోనా పాజిటివ్‌లను గుర్తించి... వెంటనే ఐసోలేట్ చెయ్యాలని సూచిస్తోంది. భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సూచనల్ని పాటిస్తోంది. మొదట్లో టెస్టులంటేనే తేలిగ్గా తీసుకున్న చాలా రాష్ట్రాలు... ఇప్పుడు అత్యంత వేగంగా టెస్టులు జరిపిస్తూ... కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇండియాలో ఒకప్పుడు కరోనా టెస్టులు చెయ్యడానికి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ (NIV) మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలో టెస్టింగ్ కేంద్రాలున్నాయి. ప్రత్యేకంగా కొవిడ్ ఆస్పత్రులు కూడా ఏర్పాటయ్యాయి. అందువల్ల ఇండియాలో ఇప్పుడు రోజుకు సగటున 2 లక్షల దాకా టెస్టులు జరుగుతున్నాయి. రెండు వారాలుగా ఇండియాలో టెస్టుల సంఖ్య బాగా పెరుగుతోంది.ఇండియాలో గత 24 గంటల్లో మరో 24248 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువై... 697287గా నమోదైంది. తాజాగా 24 గంటల్లో 425 మంది కరోనా వల్ల చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 19693కి చేరింది. రోజూ కొత్త కేసులు, మరణాలూ భారీ సంఖ్యలో నమోదవుతూ భారతీయులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఇదే సమయంలో... రికవరీ కేసులు కూడా పెరుగుతూ ఒకింత ఊరట కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో 15350 కేసులు రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీల సంఖ్య 424432కి పెరిగింది. అలాగే... ప్రస్తుతం 253287 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 60.9 శాతంగా ఉండగా... మరణాల రేటు 2.8 శాతంగా ఉంది. ప్రపంచ మరణాల రేటు 8 శాతంగా ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే... ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్నట్లు లెక్క.

ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో కేసులు 2 లక్షలు దాటి... 206619గా ఉండగా... తమిళనాడులో అవి... 111151గా నమోదయ్యాయి. ఢిల్లీలో 99444, గుజరాత్‌లో 36037, ఉత్తరప్రదేశ్‌లో 27707, తెలంగాణలో 23902, కర్ణాటకలో 23474, బెంగాల్‌లో 22126, రాజస్థాన్‌లో 20164 కేసులు నమోదయ్యాయి. ఈ లిస్టులో... తెలంగాణ ఆరోస్థానంలో ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన కలిగించే అంశం. ఏపీలో ప్రస్తుతం 18697 పాజిటివ్ కేసులున్నాయి. ఐతే... ఏపీలో యాక్టివ్ కేసులు 10వేలు దాటాయి.

 

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత... రష్యాను నాలుగోస్థానానికి నెట్టి... ఇండియా... మూడోస్థానానికి చేరింది. అసోంలో ఒక్క రోజే 720 పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగించే అంశం. ఢిల్లీలో క్రమంగా రికవరీ రేటు పెరుగుతోంది. నిన్న రికవరీలు 3083 ఉండగా... కొత్త కేసులు 2244 ఉన్నాయి. అందువల్ల రికవరీ రేటు 71.7గా ఉంది. ప్రపంచంలో ప్రతి 10లక్షల మందిలో... 1483 మందికి కరోనా సోకుతుండగా... ఇండియాలో... అది 506గా ఉంది.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 1:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading