హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

మృతులకు కరోనా పరీక్షలు చేయలేం.. మంత్రి ఈటల క్లారిటీ

మృతులకు కరోనా పరీక్షలు చేయలేం.. మంత్రి ఈటల క్లారిటీ

మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్

చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయడం అశాస్త్రీయమని.. మృతులందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు మంత్రి ఈటల.

  తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబట్టుతున్నాయి. మృతదేహాలకు టెస్ట్‌లు చేయడం లేదని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వంపై పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారని.. లెక్కల విషయంలోనూ గందరగోళం నెలకొందని అక్షింతలు వేసింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న డిమాండ్‌పై మంత్రి ఈటల స్పందించారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయడం అశాస్త్రీయమని.. మృతులందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

  చనిపోయిన వారికి టెస్ట్‌లు చేయాలని అవగాహన లేక మాట్లాడుతున్నారు. ICMR నిబంధనల్లో ఎక్కడ కూడా భౌతికకాయానికి పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. రాష్ట్రంలో నిత్యం వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశంలో నిత్యం 30వేల మంది చనిపోతున్నారు. వారందరికీ టెస్టులు చేయడం సాధ్యం కాదు. కరోనా బారిన పడినవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. వారిని బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం.
  ఈటల రాజేందర్

  కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 3742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యామి. కరోనాతో బాధపడుతూ 142 మంది బాధితులు మరణించారు. మరోవైపు కరోనా లక్షణాలు లేని పేషెంట్లను ఆస్పత్రి నుంచి ఇళ్లకు పంపిస్తున్నారు. 50 ఏళ్లలోపు కరోనా పేషంట్లను గాంధీ నుంచి ఇళ్లకు తరలిస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలులేని వారిని ఇళ్లకు పంపించేస్తున్నామని సోమవారం ఆయన చెప్పారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Coronavirus, Covid-19, Eetala rajender, Telangana

  ఉత్తమ కథలు