
ప్రధాని మోదీకి అభివాదం చేస్తున్న భారత్ బయోటెక్ ప్రతినిధులు
ప్రధాని మోదీ పర్యటనతో కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీలో తమ సంస్థ ముందుందని ప్రధాని పర్యటనతో నిరూపితమయ్యిందన్నారు. ఇది తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమ బాధ్యతను పెంచిందన్నారు.
ప్రధాని మోదీ తమ సంస్ధను ప్రత్యేకంగా సందర్శించడం ఎంతో గర్వకారణమని భారత్ బయోటెక్ ప్రకటించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ను కూడా ప్రధాని సందర్శనతో తమ సంస్థ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. ప్రధాని మోదీ పర్యటనతో కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీలో తమ సంస్థ ముందుందని ప్రధాని పర్యటనతో నిరూపితమయ్యిందన్నారు. ఇది తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తమ బాధ్యతను పెంచిందన్నారు. అంతేకాదు ప్రధాని మోదీ పర్యటన వల్ల తమ సంస్థకు, అలాగే వ్యాక్సిన్ తయారీలో పాలు పంచుకున్న సిబ్బందికి నైతిక స్థైర్యంతో పాటు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని భారత్ బయోటెక్ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రపంచంలోనే మొట్టమొదటిది, అతిపెద్దది, అలాగే కచ్చితమైనదని గుర్తు చేశారు. అంతేకాదు ఈ క్లినికల్ ట్రయల్స్ లో మొత్తం 25 నగరాల నుండి భారీ సంఖ్యలో వాలంటీర్లు పాల్గొంటున్నారని భారత్ బయోటెక్ పేర్కొంది. అంతేకాదు కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ లో కేవలం ఇండియా నుండే 26వేల మంది పాల్గొంటున్నారు అని తెలిపింది.
అలాగే కోవిడ్ – 19 వ్యాక్సిన్ తయారీలో మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెగ్యులేటర్స్, వ్యాక్సిన్ డెవలప్ మెంట్ పార్టనర్స్, మెడికల్ ఫ్రాటెర్నిటీ, మెడికల్ ఇన్వెస్టిగేటర్స్ మరియు హాస్పిటల్స్ వ్యాక్సిన్ తయారీలో ఎంతగానో సమకరించాయి. వాటన్నింటికి కృతజ్ఞతలని భారత్ బయోటెక్ తెలిపింది.
Published by:Krishna Adithya
First published:November 28, 2020, 21:47 IST