కరోనాకు వాక్సిన్ వచ్చే వరకు మాస్క్ మస్ట్: ప్రధాని మోదీ

గడిచిన 24 గంటల్లో మన దేశంలో 17,296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 407 మంది మరణించారు.

news18-telugu
Updated: June 26, 2020, 12:46 PM IST
కరోనాకు వాక్సిన్ వచ్చే వరకు మాస్క్ మస్ట్: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
కరోనా వైరస్‌కు వాక్సిన్ వచ్చే అందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలని మరోసారి దేశ ప్రజలకు సూచించారు ప్రధాని మోదీ. కరోనా నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అధికారులు, వలస కార్మికులు పాల్గొన్నారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్‌‌కు వాక్సిన్ రాలేదు. వ్యాధి బారినపడకుండా ఉండాలంటే అందరూ రెండడుగుల దూరాన్ని పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో యూపీ ప్రజలు తమ తెగవను చూపారు. విజయవంతంగా కోవిడ్‌ను ఎదుర్కోగలిగారు.
ప్రధాని మోదీ



దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో ఆత్మ నిర్భర్ రోజ్‌గార్ యోజన పథకాన్ని అమలు చేయనున్నారు. వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. బీహార్‌లో అత్యధికంగా 32 జిల్లాల్లో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన పథకం వర్తిస్తుంది. ఇక యూపీలో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 22 జిల్లాలు ఉన్నాయి. పథకం ప్రారంభమైనందున అక్కడి వలస కార్మికులకు పని కల్పించనున్నారు.


కాగా, గడిచిన 24 గంటల్లో మన దేశంలో 17,296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 407 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,85,637 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 15,301 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 1,89,463 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
First published: June 26, 2020, 12:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading