'కరోనాకు ఓటు వేయండి'.. బీజేపీ అభ్యర్థి ప్రచారం.. ప్రజలు గెలిపిస్తారా?

ఏంటి.. కరోనా పేరు పెట్టుకున్నారని అందరూ అడుగుతుండడంతో.. ''లేదు.. కరోనాకే నాపేరు పెట్టారు.'' అని నవ్వుతూ సమాధానమిస్తున్నారు కరోనా థామస్.

news18-telugu
Updated: November 20, 2020, 3:11 PM IST
'కరోనాకు ఓటు వేయండి'.. బీజేపీ అభ్యర్థి ప్రచారం.. ప్రజలు గెలిపిస్తారా?
కరోనా థామస్
  • Share this:
కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా ఇదే గోల. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. అమలాపురం నుంచి అమెరికా వరకు.. అంతటా ఈ వైరస్ నామస్మరణే వినిపిస్తోంది. ఈ పేరు వినిపిస్తేనే ప్రజల్లో ఎంతో భయం, వణుకు మొదవలవుతాయి. కాని కేరళలోని కొల్లాంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. కరోనా ప్రజల్లోకి వచ్చింది. తనకు మద్దతుగా ఉండాలని కోరుతోంది. కరోనా మద్దతు కోరడమేంటని మీరు కంగారు పడకండి. కరోనా అంటే ఇక్కడ వైరస్ కాదు.. యువతి పేరు. కొల్లాం కార్పోరేట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోందీ ఈ 24 ఏళ్ల కరోనా థామస్.

కొల్లాంకు చెందిన థామస్ ఫ్రాన్సిస్ అనే ఆర్టిస్ట్.. తన కూతురు పేరును అందరిలా కాకుండా విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండాలని భావించాడు. అందుకే కరోనా థామస్ అనే పేరును పెట్టాడు. అయితే తర్వాత కాలంలో ఆ పేరు అంత వైరల్ అవుతుందని, ప్రజల నోళ్లల్లో నానుతుందని ఆయనకు అప్పుడు తెలియదు. గతేడాది కాలం నుంచి ప్రపంచంలో ఈ పేరు తెలియని మనిషి ఉన్నాడంటే అతి శయోక్తి కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరు వినిపిస్తుండడంతో.. ఆ యువతికి ఇబ్బందిగా మారింది. ఏంటి.. కరోనా పేరు పెట్టుకున్నారని అందరూ అడుగుతుండడంతో.. ''లేదు.. కరోనాకే నాపేరు పెట్టారు.'' అని నవ్వుతూ సమాధానమిస్తున్నారు కరోనా థామస్.

కరోనాకు కరోనా..
అంతేకాకుండా 24 ఏళ్ల కరోనా థామస్‌కు కరోనా కూడా సోకింది. గర్భవతి అయిన ఆమెకు కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటీవ్ అని తేలడంతో తగిన చికిత్స తీసుకున్నారు. అనంతరం తన బిడ్డతో సహా కోలుకొని కార్పోరేట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొల్లాంలోని మథిలిల్ కార్పోరేషన్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహమ్మారి ప్రభావం కొనసాగుతుండగా.. కరోనా అనే పేరు గల వ్యక్తిని చూడటం ప్రజలకు థ్రిల్ల్ ఫీలవుతున్నారని, ఈ ప్రచారం తనకు కూడా ఆహ్లాదకరమైన అనుభవం బాగుందని ఆమె అన్నారు.

అక్టోబరు మాసంలో తనకు పాజిటివ్ అనే వచ్చిందని, ప్రజలకు సేవ చేయాలనే తపన వల్ల రాజకీయాలపై ఆసక్తి నెలకొందని కరోనా థామస్ చెప్పారు. తన బిడ్డతో సహా కోలుకున్నామని అనంతరం ఎన్నికల బరిలో దిగేందుకు తన కుటుంబం మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. తన పేరుతో ప్రజల నోళ్లల్లో మెదిలిన కరోనా థామస్.. ఏ రాజకీయనాయకుడిని లక్ష్యాంగా చేసుకుంటూ ప్రచారం నిర్వహించలేదని, ప్రజల్లోనూ అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది చెప్పారు.

కరోనాకు కవల సోదరుడు
కరోనా అంటే అర్థం హాలో అని అంటారు. కరోనా థామస్ కు కోరల్ అనే కవల సోదరుడు కూడా ఉన్నారు. మహమ్మారి ప్రారంభ రోజుల్లో తనకు చాలా కష్టంగా అనిపించదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. ముఖ్యంగా గో కరోనా గో అనే స్లోగన్ బాగా బాధపడ్డానని, చివరకు పేరు కూడా మార్చుకోవాలని అనుకున్నానని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం తన పేరంటే తనకు ఎంతో ఇష్టం ఏర్పడిందని చెప్పారు. ఎన్నికల ఫలితం సానుకూలంగా ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు కరోనా థామస్.
Published by: Shiva Kumar Addula
First published: November 20, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading