CoronaVaccine: ఆ వ్యాక్సిన్‌ వల్ల సైడ్ ఎఫెక్ట్స్.. టీకా తీసుకున్న వాలంటీర్ ఫిర్యాదు

CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కారణంగా తనపై ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్‌ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: November 30, 2020, 6:54 AM IST
CoronaVaccine: ఆ వ్యాక్సిన్‌ వల్ల సైడ్ ఎఫెక్ట్స్.. టీకా తీసుకున్న వాలంటీర్ ఫిర్యాదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ పురోగతి అంశాన్ని సమీక్షిస్తోంది. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కారణంగా తనపై ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్‌ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న కోవిషీల్డ్‌ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తోంది.

మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్‌ 1న చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లోని ఓ వాలంటీర్‌కు టీకా వేశారు. అయితే వ్యాక్సిన్ కారణంగా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందని పేర్కొన్నరు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందని అన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయని.. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని ఆరోపించారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

టీకా సైడ్ ఎఫెక్ట్స్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ వాలంటీర్ చేసిన ఆరోపణలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొట్టిపారేసింది. కావాలనే తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 100 కోట్లకు దావా వేస్తామని పేర్కొంది. వ్యాక్సిన్‌ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. మరోవైపు టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్‌ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది.
Published by: Kishore Akkaladevi
First published: November 30, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading