news18-telugu
Updated: May 6, 2020, 10:55 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ తర్వాత అత్యంత చర్చించే అంశం వలస కూలీలు. ఉపాధి కోసం వెళ్లిన కూలీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల అన్నీ మూతపడడంతో చేతిలో డబ్బులు అయిపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు కూలీలు. వారిని ఆదుకునేందుకు చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకు తమకు తోచినంత సాయంచేస్తున్నారు. ఇప్పుడు వారితో కలిశాడు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్. వివేక్ ఒబెరాయ్, ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ వ్యస్థాపకుడు రోహిత్‌తో కలసి పేదలకు సాయం చేశారు. సుమారు 5000 మంది కూలీలకు ఇంటి అద్దెను చెల్లించడం, వారికి అవసరమైన నిత్యావసరాలను అందించడం, వారి పిల్లలకు భోజనం సౌకర్యాలు అందించేందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి ఆ డబ్బులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసినట్టు వివేక్ ఒబెరాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.

వివేక్ ఒబెరాయ్
‘సాత్’ అనే కార్యక్రమం ద్వారా ఇవన్నీ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ కూడా నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా ఇలాగే స్ఫూర్తి పొందుతారని వివేక్ ఒబెరాయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 6, 2020, 10:55 PM IST