హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Visakhapatnam: విశాఖలో డేంజర్ బెల్స్? ఏయూ క్యాంపస్ లో 55 మందికి పాజిటివ్? ఉక్కు ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్

Visakhapatnam: విశాఖలో డేంజర్ బెల్స్? ఏయూ క్యాంపస్ లో 55 మందికి పాజిటివ్? ఉక్కు ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్

ఆంధ్రా యూనివర్శిటీ

ఆంధ్రా యూనివర్శిటీ

ఈ మహానగరానికి ఏమైంది. విశాఖలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ భయపెడుతోంది. గత 24 గంటల్లో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 55 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...

విశాఖలో కరోనా సెకెండ్ వేవ్ భయం వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 170 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో విశాఖలో యాక్టివ్ కేసుల సంఖ్య 504కి పెరిగింది. తగ్గిపోయాయి అనుకున్న కరోనా కేసులు మళ్లీ విస్తరిస్తుండడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఒకే రోజు 55 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన పెంచుతోంది. క్యాంపస్ లో మొత్తం 820 మందికి పరీక్షలు చేయగా.. 420 మంది రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా 400 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ వచ్చిన వారిలో 59 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరింతా హాస్టల్లో ఉండే విద్యార్థులే. దీంతో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థులు ఉండే ఆ హాస్టల్ ను క్వారంటైన్ జోన్ గా మార్చారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు..

రాజమండ్రిలోని ఓ ప్రైవేటు కాలేజీలో మొన్న 167 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏయూ క్యాంపస్ లో 59 కేసులు నమోదయ్యాయి. దీంతో కాలేజీలు, స్కూళ్లు తెరవడం సరైంది కాదని.. విద్యార్థులకు వెంటనే సెలవులు ప్రకటించి ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చే ప్రసక్తి లేదని.. ఆన్ లైన్ క్లాస్ ల వల్ల విద్యార్థులు నష్ట పోతున్నారని ప్రభుత్వం అంటోంది.. తాజాగా విశాఖ ఏయూ క్యాంపస్ లో 55 మందికి ఒకేసారి కరోనా నిర్ధారణ అవ్వడంతో.. క్యాంపస్ లో జరిగే పరీక్షలను అన్నీ రద్దు చేసి.. సెలవులు ఇవ్వాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ గురించే తాము క్యాంపస్ లో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విశాఖ ఉక్కు ఉద్యమంపైనా కరోనా ఎఫెక్ట్ పడింది. విశాఖ ప్లాంట్ ఆవరణలోనూ కరోనా సెకెండ్ వేవ్ భయపెడుతోంది. ప్లాంట్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల్లో 35 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరికీ ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చేర్చి.. పరీక్షలు నిర్వహించగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీంతో చాన్నాళ్ల తరువాత మళ్లీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు అంటూ అంతా గుమిగూడుతున్నారు. ఇలాంటి సమయంలో పదిమందికి వైరస్ సోకడంతో ఉద్యమం చేస్తున్న కొందరి కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అధికారులు మాత్రం కరోనా నిబంధనలు పాటించి అంతా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని కోరుతున్నారు.

ప్రస్తుతం విశాఖలో కరోనా చాపకింద నీరులా పారుతోంది. ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య 500 దాటింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గత నవంబర్ నెల తరువాత మళ్లీ అత్యధికంగా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. కేసులు తగ్గాయి అని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ వైరస్ పెరుగుతుండడం కలకలం రేపుతోంది.

First published:

Tags: Andhra university, Ap government, AP News, Corona, Corona Possitive, Corona Vaccine, Corona virus, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు