Home /News /coronavirus-latest-news /

VISAKHAPATNAM ANDHRA UNIVERSITY CORONA EFFECT EXAMS POSTPONED NGS

Visakhapatnam: ఏపీలో నేటి పరీక్షలు వాయిదా? ఆంధ్రా యూనివర్శిటీలో 55 మందికి కరోనా సోకడంతో నిర్ణయం

ఏపీలో నేటీ పరీక్షలు వాయిదా

ఏపీలో నేటీ పరీక్షలు వాయిదా

ఆంధ్ర యూనివర్శిటీలో ఇవాళ జరగనున్న పరీక్షలు అన్నీ వాయిదా పడ్డాయి. ఇంజనీరింగ్ క్యాంపస్ లో 55 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.

    విశాఖపట్నాన్ని కరోనా వైరస్ గజ గజా వణికిస్తోంది. రోజు రోజుకూ కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య పెరగడం ఆందోళన పెంచుతోంది. గత నవంబర్ లో పరిస్థితి మళ్లీ వస్తుందా అనే భయం వెంటాడుతోంది. గత వరాం రోజుల నుంచి ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా రికార్డు స్థాయిలో 170 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో పరిస్థితి అదుపుతప్పిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సెకెండ్ వేవ్ మొదలైందనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మదనపడుతున్నారు.

    కేవలం విశాఖలోనే కాదు ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో కాలేజీలు, స్కూళ్లు మూసేయాలని.. ఆన్ లైన్ క్లాంస్ లు పెట్టాలనే డిమాండ్ మొదలైంది. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కేవలం ఆన్ లైన్ లోనే క్లాస్ లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. కరోనా వ్యాప్తి పేరు చెప్పి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేమని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఏపీలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించారు. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు భానుడి భగభగల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి. అలాగే కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని విద్యా సంస్థలు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

    ఓ వైపు మంత్రి కాలేజీలు, స్కూళ్లు యధావిధిగా నడుపుతామన్ని ప్రకటిస్తున్నా.. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో కరోనా సోకినవారికలో విద్యార్థులకు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు.. ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విద్యాసంస్థలకు పంపించకపోతే హాజరు వేయరని.. పరీక్షల్లో పాస్ చేయరని భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు.

    తాజాగా విశాఖ ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్ లో 55 మందికి కరోనా నిర్ధారణ కావడంతో శనివారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు ఏయూ అధికారులు. బీఈ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో పరీక్షలను వాయిదా వేస్తున్న ప్రకటన జారీ చేశారు. అయితే వాయిదా పడ్డ పరీక్షల తేదీల రీషెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామంటూ నోటీసు విడుదల చేశారు.

    అయితే ప్రస్తుతం క్యాంపస్ లో ఉంటున్న విద్యార్థులు మాత్రం ఈ ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల డిమాండ్ ఎలా ఉన్నా.. ప్రస్తుతం పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏయూ ఇంజనీరింగ్ హాస్టల్‌లోని ఆరు బ్లాకులను కరోనా వార్డులుగా మార్చామని, అందులో రెండు బ్లాకులను ఐసోలేషన్ వార్డులుగా మార్చినట్లు ఆయన చెప్పారు. కరోనా సోకిన 55 మంది విద్యార్థుల్లో ఎవరికి కూడా వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని విశాఖ జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. అయితే ఒకేసారి ఇన్ని కరోనా కేసులు రావడంతో ఏయూ విద్యార్థులు, ఉద్యోగులు మాత్రం అందోళన చెందుతున్నారు. కరోనా సోకిన విద్యార్థులంతా గత రెండు, మూడు రోజులుగా ఎవరెవర్ని కలిశారనే విషయంపై చర్చించుకుంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Andhra university, AP News, Corona, Corona Possitive, Corona Vaccine, Corona virus, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు