Viral: ముసుగు తీసేయండి..! డాక్టర్ మాస్కు తీసేస్తున్న పాప.. సోషల్ మీడియాలో పిక్ వైరల్..

మాయదారి రోగం వచ్చి మానవజీవితాలను ఆగం చేస్తున్నది. బయటకెళ్లాలంటే మాస్కులు లేకుండా వెళ్లలేని దుస్థితి. ఈ సమయంలో ఒక చిన్నారి మనందరికి చిన్న నమ్మకాన్ని ఇస్తున్నది.

news18
Updated: October 16, 2020, 3:07 PM IST
Viral: ముసుగు తీసేయండి..! డాక్టర్ మాస్కు తీసేస్తున్న పాప.. సోషల్ మీడియాలో పిక్ వైరల్..
image credit : Facebook
  • News18
  • Last Updated: October 16, 2020, 3:07 PM IST
  • Share this:
మాయదారి రోగం కరోనా తీసుకొచ్చిన కలవరంతో ఎక్కడికెళ్లినా మాస్కు పెట్టుకోవాల్సిందే. లేకుంటే ఆ వైరస్ మనను ఎక్కడ అంటుకుంటుందోననో భయం. ఇక ఈ మహమ్మారికి ఎదరొడ్డి పోరాడుతున్న వైద్య సిబ్బంది బాధలు వర్ణణాతీతం. సాధారణ పేషెంట్ కు ట్రీట్మెంట్ చేయాలన్నా.. పీపీఈ కిట్లు, మాస్కులు ఉండాల్సిందే. కరోనా వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. అయితే ఈ మాస్కుల గోల ఎప్పుడంతమవుద్దిరో దేవుడా అంటూ అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన ఒక పాప డాక్టర్ మూతికి ఉన్న మాస్కును తీసేస్తున్న ఫోటో వైరల్ గా మారింది. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ డాక్టర్ రాసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

యూఎఈలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సమీర్ ఈ పిక్చర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో అప్పుడే పుట్టిక ఒక నవజాత శిశువు.. ఆయన ముఖానికి పెట్టుకున్న మాస్కును లాగేస్తున్నది. దీనికి ఆయన పోస్టు రాస్తూ.. ‘మనమందరం త్వరలోనే ముసుగు తీయబోతున్నాం’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే ఈ పిక్చర్ వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఆ పిల్లాడి ఆశ నెరవేరాలని ఆశిద్దాం అంటూ రిప్లైలలు ఇస్తున్నారు. మరికొంతమంది ఆ పాప నమ్మకం నిజం కావాలని ఆశించారు.సమీర్ వంటి వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కోవిడ్ తో ప్రత్యక్షంగా పోరాడుతున్నవారే గాక సాధారణ పేషెంట్లకు వైద్యం చేసేప్పడు కూడా వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆపరేషన్లు చేయాల్సి వస్తే.. గంటల కొద్దీ పీపీఈ కిట్లు ధరించడం, ఆస్పత్రిలో ఉన్నంతసేపు చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు పెట్టుకోవడం వారికి కష్టంగా మారింది. క్రమం తప్పకుండా ఇలాగే పెట్టుకోవడం వల్ల చాలా మందికి ముఖం, చేతులపై ఇన్ఫెక్షన్ కూడా వస్తున్నది. అయినా సరే.. వారికి తప్పట్లేదు.

మరోవైపు కరోనా విజృంభణ కూడా పెరుగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా దీని బారిన పడ్డారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిమీద ఇప్పటికీ ఎవరికీ అంచనాలు లేవు. ఒకవైపు పలుదేశాలు వ్యాక్సిన్ ను వచ్చే జనవరి, మార్చి నాటికి విడుదల చేస్తామన్నా.. అవి ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది అనుమానాస్పదమే. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే 2022 దాకా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు లేవని చెబుతుండటం గమనార్హం.
Published by: Srinivas Munigala
First published: October 16, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading