కరోనా వారియర్లపై దాడులను సహించేది లేదు... ప్రధాని మోదీ వార్నింగ్

Corona Lockdown | Corona Update : ప్రజల్లో కాన్ఫిడెన్స్ రావాలి. ఏదైనా సాధించగలమనే నమ్మకం పెరగాలి. ఆ దిశగా ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు చైతన్యపూరిత ప్రసంగాలు చేస్తున్నారు.

news18-telugu
Updated: June 1, 2020, 11:58 AM IST
కరోనా వారియర్లపై దాడులను సహించేది లేదు... ప్రధాని మోదీ వార్నింగ్
ప్రధానమంత్రి మోదీ (credit - twitter - ANI)
  • Share this:
Corona Lockdown | Corona Update : కరోనాపై పోరాడుతూ... ఫ్రంట్‌లైన్‌లో ఉన్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, వైద్య సిబ్బందిపై దాడులు, హింస, కించపరిచే ప్రవర్తన వంటివి ఏమాత్రం సహించే ప్రసక్తి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడానికి మూడు అంశాలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... సిల్వర్ జూబ్లీ (25 ఏళ్లు పూర్తి చేసుకున్న) జరుపుకుంటున్న సందర్భంగా... ప్రధాని తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా... ఇండియా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (భారత జాతీయ పోషకాల కార్యక్రమం) ద్వారా... పిల్లలు, వారి తల్లులకు ఎలాంటి సాయం అందిందో ప్రధాని ప్రస్తావించారు. 2025 కల్లా దేశంలో క్షయ (TB)ని పూర్తిగా తరిమికొట్టేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మిషన మోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది అత్యంత కీలకం అన్నారు ప్రధాని మోదీ. అంటే ఎవరికైనా ఓ ఆలోచన వచ్చినప్పుడు... దాన్ని పేపర్‌పై పెట్టాలన్న మోదీ... దాన్ని సమర్థంగా అమల్లోకి తేవడం ద్వారా అదో అద్భుతమైన ఐడియాగా మారుతుందని అన్నారు.

మూడు అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలని ప్రధాని మోదీ కోరారు. ఒకటి... టెలి మెడిసిన్‌లో ఆధునికత. టెలీ మెడిసిన్‌లో మార్పుల్ని తీసుకురావడం ద్వారా... దాన్ని భారీ స్థాయిలో అందుబాటులోకి తేవచ్చన్నారు.

రెండో అంశం ఆరోగ్య రంగంలో మేకిన్ ఇండియాగా తెలిపారు. ప్రారంభ దశలో వస్తున్న ఫలితాలు అంచనాల్ని పెంచాయన్న మోదీ... దేశీయ తయారీదారులు స్వయంగా PPEలను తయారుచేస్తూ... ఇప్పటివరకూ... కోటి PPEలను కరోనా వారియర్లకు అందజేశారని తెలిపారు.

ఇక మూడోది... ఆరోగ్యకరమైన సమాజాల్లో ఐటీ సంబంధిత అంశాలుగా ప్రధాని తెలిపారు. ఆరోగ్య సేతును ఇప్పటికే 12 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని బట్టీ దేశంలో ప్రజలకు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు ప్రధాని మోదీ. ఆ యాప్ కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడుతోందని అన్నారు.
First published: June 1, 2020, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading