పెళ్లి వేడుకను అడ్డుకున్నారని దాడి.. ఎమ్మార్వోతో పాటు పోలీసులనూ చితకబాదారు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

స్థానికుల దాడిలో తహశీల్దారు శృతిరంజన్ శతపతి, ఎస్సైలు ముకేశ్ లక్రా, హేమంత్ సేథితో పాటు నలుగురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. వారిని ఆర్‌.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందించారు.

 • Share this:
  మన దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. సెకండ్ వేవ్‌లో కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా కఠిన ఆంక్షలు విధించారు. పరిమిత సంఖ్యలోనే మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు చెబుతున్నా.. వినిపించుకోకుండా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఒడిశాలో ఇలాగే ఓ పెళ్లి వేడుకలో రూల్స్‌ను అతిక్రమించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు అధికారులపై పెళ్లి బృందం దాడి చేసింది. ఎమ్మార్వోతో పాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ను చితకబాదారు. గజపతి జిల్లాలోని ఆర్.ఉదయగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  శుక్రవారం చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత ఊరేగింపు వేడుకను నిర్వహించారు. పెద్ద మొత్తంలో బంధువులు, స్థానికులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న తహశీల్దారు శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని తెలియదా? పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం ఊరేగింపును అడ్దుకునే ప్రయత్నం చేయడంతో.. పెళ్లి బృందం రెచ్చిపోయింది. ఊరేగింపును అడ్డుకుంటారా? అని దాడికి పాల్పడ్డారు.

  స్థానికుల దాడిలో తహశీల్దారు శృతిరంజన్ శతపతి, ఎస్సైలు ముకేశ్ లక్రా, హేమంత్ సేథితో పాటు నలుగురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. వారిని ఆర్‌.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. మరికొందరిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై సబ్ కలెక్టర్ సంగ్రాం కేసరి ఆరా తీశారు. గ్రామస్తుల దాడి గురించి తహశీల్దార్‌తో చర్చించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎవరినీ వదిలిపెట్టకూడదని అధికారులను ఆదేశించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: