news18-telugu
Updated: March 4, 2020, 2:05 PM IST
Coronavirus : కరోనా వైరస్ (Credit - NIAID-RML)
కరోనా కలకలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. విజయవాడలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. నగరానికి చెందిన లక్ష్మారెడ్డి లో కరోనా లక్షణాలు కనపడటంతో.. ఆస్పత్రికి తరలించారు. ఇటీవల జర్మనీ, బెంగళూరులో పర్యటించిన లక్ష్మారెడ్డి.. తీవ్ర జలుబుతో బాధపడుతున్నారు. ఆయనకు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. శాంపిల్స్‌ను హైదరాబాద్ నుంచి పుణెకు తరలిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్లోనిగాంధీ ఆస్పత్రిలో ఈనెల 3వ తేదీన 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 45 మందికి ఎలాంటి వైరస్ సోకలేదని నిర్ధారించారు.మరో ఇద్దరి రిపోర్టులను పూణె లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటి వరకు దేశంలోని 28 మంది కరోనా వైరస్‌కు చికిత్స పొందుతున్నట్టు కంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల వరకు శుభ్రత చర్యలు చేపట్టామని చెప్పారు. ఢిల్లీలోని మరిన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల సంఖ్య పెంచాలని ఆదేశించామన్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలో కరోనా కలకలం రేపుతోంది. మైండ్ స్పేస్ సముదాయంలోని ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో... కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులను ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. దీంతో ఉద్యోగులను ఇంటికి వెళ్లిపోవాలని తెలిపిన కంపెనీ ప్రతినిధులు... వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. మైండ్ స్పేస్‌లోని అనేక కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపించి... వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
March 4, 2020, 1:49 PM IST