• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • VIJAYAWADA RMP TREATED CORONA PATIENT WITH LESS KNOWLEDGE AND HE DIED AFTER SHIFTING PRIVATE HOSPITAL IN TENALI TOWN OF GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: జ్వరమొస్తే ఆర్ఎంపీ దగ్గరకి వెళ్లాడు.. అసలు విషయం తెలిసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

Andhra Pradesh: జ్వరమొస్తే ఆర్ఎంపీ దగ్గరకి వెళ్లాడు.. అసలు విషయం తెలిసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ (Corona Virus) సైలెంట్ కిల్లర్ గా మారింది. సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలను హరించేస్తోంది. కొన్నిచోట్ల అగాహనలేమితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు

  • Share this:
    కరోనా వచ్చి ఏడాది గడిచినా ప్రజల్లో దానిపై అవగాహన కొరవడుతోంది. ఇప్పటికీ కొంతమంది ఈ మహమ్మారిని లైట్ తీసుకుంటున్నారు. అసలు విషయం తెలిసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ఏడాది కాలంలో చాలా కేసులు ఇలానే వెలుగు చూశాయి. చిన్నజ్వరాన్ని తేలిగ్గా తీసుకోవడం.. ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత పెద్దాస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కానీ అప్పటికే వైరస్ ఊపిరి తీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన కిరాణా వ్యాపారి శ్రీనివాస చక్రవర్తి ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. జ్వరంగా ఉండటంతో ఇంటి సమీపంలోని ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అక్కడ జ్వరం చూసిన ఆర్ఎంపీ మందులిచ్చి పంపేశాడు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొవిడ్ టెస్టు చేయగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

    దీంతో అక్కడే చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. శ్రీనివాస చక్రవర్తి మృతితో అతడి బంధువులు ఆగ్రహిస్తున్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే వ్యాధి ముదిరి చనిపోయాడంటూ క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు బంధువులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. క్లినిక్‌ను 10 రోజుల పాటు మూసేయాలని ఆదేశించారు. కరోనాపై అవగాహన లేకపోవడం, జాగ్రత్తలు లేకపోవడంతో నిండు ప్రాణం బలైంది. జ్వరం, జలుబు, దగ్గు లాంటి ఏ చిన్న లక్షణాలున్నా ఆర్ఎంపీలను కాకుండా డాక్టర్లను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

    ఇది చదవండి: ఏపీలో వైరస్ వర్రీస్.. ఆ రెండు జిల్లాల్లో హై అలర్ట్


    మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,116 శాంపిల్స్ ని పరీక్షించగా1,288 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 311, చిత్తూరు జిల్లాలో 225 పాజిటివ్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 07 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,04,548కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 8,88,508 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో 610 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో ఐదుగురు మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,225కి చేరింది.

    ముఖ్యంగా గుంటూరు జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజుల్లో జిల్లాలో దాదాపు 800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెలుగులోకి వస్తున్న కేసులో ఈ సంఖ్యలో ఉంటే.. తెనాలి ఘటనలో బయటకురాని కేసులు మరిన్ని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు