• HOME
  • »
  • NEWS
  • »
  • CORONAVIRUS-LATEST-NEWS
  • »
  • VIJAYAWADA NGOS FROM GUNTUR DOING FUNERALS FOR CORONA DEAD BODIES IF FAMILY MEMBERS ADMITTED IN HOSPITALS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: కరోనా కష్టకాలంలో ఆపద్బాంధవులు వీళ్లే.. అయినవాళ్లు లేకపోయినా స్వర్గానికి సాగనంపేది వీళ్లే..

Andhra Pradesh: కరోనా కష్టకాలంలో ఆపద్బాంధవులు వీళ్లే.. అయినవాళ్లు లేకపోయినా స్వర్గానికి సాగనంపేది వీళ్లే..

అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిథులు

కరోనా విపత్కర (Corona Pandemic) పరిస్థితుల్లో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాని సమయంలో పలు సంస్థలు ఆబాధ్యతను నెరవేరుస్తున్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈక్రమంలో రోజుకు సగటున 20 నుంచి 30 మంది మృత్యువాత పడుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. కొందరు కరోనా భయంతో మరికొందరు ఇతర అనారోగ్యాలతో ఊపిరి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారుతోంది. అలాంటి వారికోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు, సేవా సమితిలు, ఛారిటబుల్ ట్రస్టులు.. పేరేదైనా వారందరి లక్ష్యం ఒకటే. ఆపన్నులను ఆదుకోవడం. అలాంటి కోవలోకే వస్తాయి గుంటూరు కు చెందిన శ్రీ విజేత సేవాసమితి, అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఇంకా మరికొన్ని సంస్థలు. గతంలో ఐతే ఆపన్నులకు ఆకలి తీర్చడం,ఆర్ధికసహాయం చేయడం,ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తమపరిధిలో చేపతనైనంత సాయం చేయడం చేస్తుంటారు ఈ ట్రస్టుల నిర్వాహకులు.

    ఐతే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటం తో వీరు తమ భాధ్యత మరింత పెరిగింది అంటున్నారు. కరోనా రెండవ దశ మొదలైనప్పటి నుండి మరణాల రేటు అధికంగా ఉండటంతో స్మశాన వాటికల వద్ద మృత దేహాలు బారులు తీరుతున్నాయి.ఐతే కొంత మంది కరోనాతో మృతి చెందితే వారి కుటుంబసభ్యులు కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ ఉండటంతో సదరు మృతదేహాలకు సాంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు కూడా ఉండటం లేదు. అటువంటి వారి మృత దేహాలకు గుంటూరులోని శ్రీ విజేత సేవా సమితి, అమ్మ ఛారిటబుల్ ట్రస్టుల వారు హిందూధర్మం ప్రకారం సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఎలా బ్రతికి నప్పటికీ మనిషి అంతిమ సమయంలో కనీసం నలుగురు తోడులేకుండా చనిపోవడం దురధృష్ట కరం అని ఆ బాధ మృతుని కుటుంబసభ్యులకు ఉండరాదనే తాము ఈ కార్యక్రమానికి నడుంబిగించామని సేవా సంస్థల నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

    ఇది చదవండి: ఏపీలో కరోనా విలయతాండవం... 10వేలు దాటిన రోజువారీ కేసులు


    గుంటూరు పట్టణంలోని బొంగరాల బీడు స్మశాన వాటిక నందు ఈ రోజు ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించినట్లు పలు సేవా సంస్థల నిర్వాహకులు తెలిపారు. కరోనాతో కుటుంమంతా బాధపడుతూ ఎవరైనా మరణించినా..., అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితుల్లో లేకపోయినా.. తమకు సమాచారం అందిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇందులో ఎలాంటి వసూళ్లుగానీ, లాభాపేక్షలు లేవని చెప్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అయినావారే ముందుకురాని ఈ రోజుల్లో ప్రమాదమని తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలను పలువురు అభినందిస్తున్నారు.

    ఇది చదవండి: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దుపై కీలక ప్రకటన.. సరైన నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి

    Published by:Purna Chandra
    First published: