విజయవాడ వాసులకు గమనిక.. ఆరు రోజులు ఈ మార్కెట్ బంద్..

విజయవాడ సమీపంలోని గొల్లపూడి మార్కెట్‌ను రేపటి నుంచి (జూలై 13) నుంచి ఆరు రోజుల పాటు లాక్ చేయనున్నారు.

news18-telugu
Updated: July 12, 2020, 6:27 PM IST
విజయవాడ వాసులకు గమనిక.. ఆరు రోజులు ఈ మార్కెట్ బంద్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో మళ్లీ కొన్ని చోట్ల లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు స్థానిక జిల్లాల్లో అధికారులు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా విజయవాడలో కూడా కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని గొల్లపూడి మార్కెట్‌ను రేపటి నుంచి (జూలై 13) నుంచి ఆరు రోజుల పాటు లాక్ చేయనున్నారు. ఇప్పటికే విజయవాడ నగరంలో పలు నిబంధనలు అమలవుతున్నాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే వ్యాపారాలకు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత వ్యాపార సముదాయాలు మూసి ఉంచుతున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులే స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను విధించుకుంటున్నారు. విజయవాడ గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ను రేపటి నుంచి ఆరు రోజులు మూసివేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మార్కెట్‌ను బంద్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు ఇవి నిలిచిపోనున్నాయి.. ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం.. ఇత‌ర మార్కెట్ల‌పై సైతం ప‌డ‌నుంది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,933 పాజిటివ్‌‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,914 కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18, ఇతర దేశాల నుంచి వచ్చి వారిలో ఒకరికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి పెరిగింది. ప్రస్తుతం 13,428 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉండగా, 15,412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, అనంతపురంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 12, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading