హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Vijayawada Fire Mishap | అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం

Vijayawada Fire Mishap | అగ్ని ప్రమాద మృతులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

Vijayawada Fire Mishap | విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. స్వర్ణా ప్యాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా వాడుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి...ఈ ఘటన పట్ల విచారం వ్యక్తంచేశారు. మృతులకు ప్రగాడ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన వారు...క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ అగ్ని ప్రమాద ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యకత్ంచేశారు. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ వద్ద ఆరా తీసినట్లు తెలిపారు. ఏ రకమైన సాయం కావాలన్నా కేంద్రం నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.


విజయవాడ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

First published:

Tags: Coronavirus, Covid-19, Pm modi, President of India, Vice President of India, Vijayawada Fire Accident

ఉత్తమ కథలు