news18-telugu
Updated: August 9, 2020, 11:18 AM IST
సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ
అమరావతి: విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌గా ఉన్న స్వర్ణ ప్యాలస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ఫోన్ చేశారు. ఈ ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు, దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధాని మంత్రికి సీఎం తెలిపారు.
విజయవాడ అగ్ని ప్రమాదం..వీడియో
స్వర్ణ ప్యాలెజ్ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా నడుపుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అందులో 30 మంది కరోనా రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
విజయవాడ ఘటనపై రాష్ట్రపతి దిగ్ర్భాంతి..
అటు ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలుగులో రాష్ట్రపతి కోవింద్ తన సంతాప సందేశాన్ని ట్వీట్ చేశారు.
విజయవాడ కోవిడ్ సెంటర్లొ జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరినట్లు అధికారులు తెలిపారు.
Published by:
Janardhan V
First published:
August 9, 2020, 10:01 AM IST