విజయవాడ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్ర్భాంతి

Vijayawada Fire Accident: విజయవాడలో రమేశ్ ఆస్పత్రి లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా నడుపుతున్న స్వర్ణ ప్యాలస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: August 9, 2020, 11:03 AM IST
విజయవాడ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్ర్భాంతి
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
  • Share this:
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. స్వర్ణా ప్యాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా వాడుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం దిగ్ర్భాంతికరమన్నారు. కోవిడ్ క్వారంటైన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడం...పలువురు మృతి చెందడం ఆవేదనకు గురిచేస్తోందన్నారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని చంద్రబాబు కోరారు.సమగ్ర విచారణ జరిపించాలి: పవన్ కల్యాణ్
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రమేశ్ హాస్పిటల్స్ కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? లోపాలు ఏమిటో సమగ్ర విచారణ చేయించాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూచించారు.
Published by: Janardhan V
First published: August 9, 2020, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading