news18-telugu
Updated: August 9, 2020, 10:46 AM IST
విజయవాడలో అగ్ని ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన డీజీపీ సవాంగ్
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. రాష్ట్ర డీజీపీ సవాంగ్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు, ఇతర అంశాలను డీజీపీ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారుల దగ్గర అడిగి తెలుసుకున్నారు. రమేశ్ ఆస్పత్రి స్వర్ణా ప్యాలస్ హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.50 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రమాదం గురించి ప్రధాని నరేంద్రమోదీ సీఎం జగన్‌కు ఫోన్ చేసి ఆరాతీశారు.
Published by:
Janardhan V
First published:
August 9, 2020, 10:45 AM IST