news18-telugu
Updated: July 30, 2020, 5:50 PM IST
విజయవాడ కనకదుర్గమ్మ
కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయ పరంగా ఆదుకోవాలని బెజవాడ దుర్గగుడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గురువారంనాటి దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం అనంతరం...పాలకమండలి నిర్ణయాలను చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. ఆలయ సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. భక్తులు నిర్భయంగా దర్శనంకి రావొచ్చని...ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయాల్లో మార్పులు చేస్తామన్నారు.
ఆలయ అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు కావాలని పిలుపుచ్చారు. శివాలయం పునర్నిర్మాణంతో పాటు శాశ్వత అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని..త్వరలోనే డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయం చేపట్టనున్న కొత్త పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Published by:
Janardhan V
First published:
July 30, 2020, 5:25 PM IST