హోమ్ /వార్తలు /coronavirus-latest-news /

Corona Virus: విద్యార్థులకు కరోనా సోకితే ఏం చేయాలి...? విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Corona Virus: విద్యార్థులకు కరోనా సోకితే ఏం చేయాలి...? విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో పాజిటివ్ (Corona Positive) కేసులు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో పాజిటివ్ (Corona Positive) కేసులు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో పాజిటివ్ (Corona Positive) కేసులు పెరుగుతున్నాయి.

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా దాదాపు వెయ్యి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా వ్యాప్తిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే మూసేయాలని మంత్రి ఆదిపమూలపు సురేష్ ఆదేశించారు. ఈ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు లేకుండా వచ్చే విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీల్లోనే వాటిని అందజేయాలని స్పష్టం చేశారు. స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్స్ నుంచి శానిటైజర్లు, మాస్కులు కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఇనిస్టిట్ట్యూట్ లోనూ థర్మల్ స్క్రీనింగ్ ఏర్పు చేయాల్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాల ఇచ్చినట్ల మంత్రి సురేష్ స్పషం చేశారు.

    అలాగే మధ్యాహ్న భోజన పథనాకిని ఒకేసారి అందరి విద్యార్థులను ఒకేసారి కాకుండా... విడతల వారీగా పంపాలని ఆదేశించారు అలాగే.. విద్యార్థులకు వడ్డించేటప్పుడు చేతికి గ్లౌజులు ధరించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు వీటిని సరఫరా చేయాలన్న మంత్రి.. దీనిపై పర్యవేక్షణకు జిల్లాలు, మండలాల స్థాయిలో ప్రత్యేక విభాగాన్నిఏర్పాటు చేస్తున్నామన్నారు.

    రాష్ట్రంలో పాఠశాలల మూసివేత ప్రసక్తే లేదని ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయని.. స్కూళ్లలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరునమోదు చేయలాన్నారు. రాష్ట్రంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం క్లాసులు కొనసాగుతున్నాయని.. తెలిపారు. మే 31 వరకు క్లాసులు కొనసాగిస్తామని.. మే 5 నుంచి ఇంటర్, జూన్ 7 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేశారు.

    స్కూళ్లు, కాలేజీల్లో కరోనా పంజా..

    మరోవైపు ఏపీలోని స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో 104 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆంధ్రా యూనివర్సిటీలో 30, శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 10, కర్నూలు జిల్లాలో ఏడుగురు, తిరుపతిలోని గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్లో ఏడు కేసులు తేలాయి. గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 160 మందికి పైగా విద్యార్థులకు కరోనా సోకింది. గడచిన 40 గంటల్లో ఏయూలో ఏకంగా 83 మందికి కరోనా వైరస్ సోకింది. వీళ్లందర్నీ ఏయూలోని ఇంజనీరింగ్ విభాగంలోనే ఇంచి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఏయూలోని హాస్టళ్లన్నీ మూసేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు.

    ఇక రాజమండ్రిలో 163 పాజిటివ్ కేసులు వచ్చిన కాలేజీలో.. తాజాగా మరో 50 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో ఆ కాలేజీలో పాజిటివ్ కేసుల సంఖ్య 213కి చేరింది. వీరందరికీ కాలేజీలోనే ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అకడమిక్ క్యాలెండర్ దృష్ట్యా.. విద్యాసంస్థలను కొనసాగించాలని భావిస్తోంది.

    First published:

    ఉత్తమ కథలు