Home /News /coronavirus-latest-news /

VIJAYAWADA ANDHRA PRADESH GOVERNMENT SEND CORONA VACCINES TO DISTRICTS ACROSS THE STATE FULL DETAILS HERE PRN

Corona Vaccine in AP: ఏపీలో వ్యాక్సిన్ లేటెస్ట్ రిపోర్ట్.. ఏ జిల్లాలో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు (Corona Vaccine) పెరుగుతుండగా.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ (Corona Vaccination) కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

    దేశవ్యాప్తంగా కరోనా టీకా ఉత్సవ్ జరుగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది. దేశంలోనే అత్యధికంగా రోజుకు 6లక్షల మందికి పైగా వ్యాక్లిన్ వేస్తోంది. ఇంర్డు సచివాలయాలు, పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. నెల రోజుల్లో దాదాపు కోటి మందికి టీకా వేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకోసం 60లక్షల టీకాలు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు 6లక్షల వ్యాక్సిన్ డోసులను పంపింది. పుణే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ప్రత్యేక విమానంలో టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. పటిష్ట బందోబస్తు మధ్య వ్యాక్సిన్ డోసులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు భద్రపరిచారు. వ్యాక్సిన్లను ప్రాధాన్యతాక్రమంలో అన్ని జిల్లాలకు అధికారులు సరఫరా చేశారు. వ్యాక్సిన్లు ప్రత్యేక వాహనాల్లో ఆయా జిల్లా కేంద్రాలకు తరించారు. దీంతో ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఊపందుకోనుంది.

    జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసుల వివరాలు ఇలా ఉన్నాయి.

    శ్రీకాకుళం
    23,450 డోసులు కోవిషీల్డ్
    5 వేలు డోసులు కోవాక్సిన్

    విజయనగరం
    21,300 డోసులు కోవిషీల్డ్
    5 వేలు డోసులు కోవాక్సిన్

    విశాఖపట్నం
    51,450 డోసులు కోవిషీల్డ్
    15 వేలు డోసులు కోవాక్సిన్

    ఈస్ట్ గోదావరి
    53,350 డోసులు కోవిషీల్డ్
    7 వేలు డోసులు కోవాక్సిన్

    వెస్ట్ గోదావరి
    32,700 డోసులు కోవిషీల్డ్
    5 వేలు డోసులు కోవాక్సిన్

    కృష్ణాజిల్లా
    42,650 డోసులు కోవిషీల్డ్
    15 వేలు డోసులు కోవాక్సిన్

    గుంటూరు
    56,300 డోసులు కోవిషీల్డ్
    12 వేలు డోసులు కోవాక్సిన్

    ప్రకాశం
    31,500 డోసులు కోవిషీల్డ్
    5 వేలు డోసులు కోవాక్సిన్

    నెల్లూరు
    26,800 డోసులు కోవిషీల్డ్
    5 వేలు డోసులు కోవాక్సిన్

    చిత్తూరు
    54,800 డోసులు కోవిషీల్డ్
    8 వేలు డోసులు కోవాక్సిన్

    కర్నూలు
    39,500 డోసులు కోవిషీల్డ్
    6,500 డోసులు కోవాక్సిన్

    కడప
    26,300 డోసులు కోవిషీల్డ్
    5,500 డోసులు కోవాక్సిన్

    అనంతపురం
    39,900 డోసులు కోవిషీల్డ్
    6 వేలు డోసులు కోవాక్సిన్

    ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమా..? 40వేలు దాటిన యాక్టివ్ కేసులు


    జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రులకు తరలించిన వ్యాక్సిన్లను అక్కడి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలిస్తారు. ఇప్పటికే జిల్లాలకు వ్యాక్సిన్లు తరలివెళ్లడంతో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టీకా డోసులు సరఫరా చేయాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.  మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అన్నారు.

    ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..? నైట్ కర్ఫ్యూకి డేట్ ఫిక్స్..?

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Corona Vaccine

    తదుపరి వార్తలు