Home /News /coronavirus-latest-news /

VIJAYAWADA ANDHRA PRADESH EDUCATION MINISTER ADIMULAPU SURESH CLARIFIES THAT THERE NO SIGN OF SHUTTING DOWN OF SCHOOLS DUE TO COVID 19 FULL DETAILS HERE PRN

Andhra Pradesh: తెలంగాణ ఎఫెక్ట్.. ఏపీలో స్కూళ్ల మూసివేతపై ప్రభుత్వం కీలక ప్రకటన..

ఆదిమూలపు సురేష్(ప్రతీకాత్మక చిత్రం)

ఆదిమూలపు సురేష్(ప్రతీకాత్మక చిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పాఠశాలలను మూసివేసే ఉద్దేశమే లేదని ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు.

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నైట్ లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మెడికల్ కాలేజీలు తప్ప మిగిలిన విద్యాసంస్థలన్నీ మూసివేశారు. మళ్లీ ప్రభుత్వం చెప్పేవరకు విద్యాసంస్థలు తెరవొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యాసంస్థలు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ వార్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో స్కూళ్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

    ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను మూసివేసే ఉద్దేశమే లేదని ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదన్నారాయన. అలాగే ఆన్‍లైన్‍లో విద్యా బోధన ప్రసక్తే లేదని.. ఆన్‍లైన్ క్లాస్‍ల వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. స్కూళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

    ఇది చదవండి:ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం... నిమ్మగడ్డ కీలక ప్రకటన


     విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కోవిద్ ప్రోటోకాల్స్ ను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. మాస్కులు ధరిస్తూ.. భౌతికదూరం పాటించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వేరని.. ఇక్కడ కొవిడ్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు.

    ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ఏపీ ప్రభుత్వం  ప్రకటించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతుల నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం అందిస్తారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

    ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం ఏకంగా 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యంధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. ఒక్కరోజులో 33,634 శాంపుల్స్ ను టెస్ట్ చేయగా.. 492 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,94,536కి చేరింది.   ఐతే అక్కడక్కడా విద్యార్థులు కొవిడ్ భారిన పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Schools, Corona virus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు