హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఆ ఇండోనేషియన్లపై అనుమానాలు... విచారణకు వీహెచ్‌పీ డిమాండ్

ఆ ఇండోనేషియన్లపై అనుమానాలు... విచారణకు వీహెచ్‌పీ డిమాండ్

కరీంనగర్‌లో కరోనా భయం కారణంగా నెలకొన్న అప్రమత్తత

కరీంనగర్‌లో కరోనా భయం కారణంగా నెలకొన్న అప్రమత్తత

కరీంనగర్‌లో కరోనా కలకలం రేగడానికి కారణమైన ఇండోనేషియన్ల మన దేశానికి ఏ వీసా ప్రకారం వచ్చారని తెలంగాణ వీహెచ్‌పీ అనుమానం వ్యక్తం చేసింది.

  కరీంనగర్‌లో కరోనా కలకలం రేగడానికి కారణమైన ఇండోనేషియన్ల మన దేశానికి ఏ వీసా ప్రకారం వచ్చారని తెలంగాణ వీహెచ్‌పీ అనుమానం వ్యక్తం చేసింది. వారికి కరీంనగర్‌లో స్థానికంగా ఉండటానికి ఏ సంస్థ ఏర్పాట్లు చేసిందని ప్రశ్నించింది. సీఏఏ వ్యతిరేక సమావేశాల పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన పీఎఫ్ఐ సంస్థ కరీంనగర్ నిర్వాహకులు జమీల్ దగ్గర ఇండోనేషియన్లు ఆశ్రయం పొందారని ఆరోపించింది. కరీంనగర్ పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలు ఎందుకు తిరిగారనే అనుమానం ప్రజల్లో ఉందని పేర్కొంది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఈ అంశపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది.

  Vhp demands equiry on Indonesians who entered Karimnagar with coronavirus ak ఆ ఇండోనేషియన్లపై అనుమానాలు... విచారణకు వీహెచ్‌పీ డిమాండ్
  వీహెచ్‌పీ విడుదల చేసిన ప్రకటన

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Coronavirus, Indonesia, Karimangar, Telangana, VHP

  ఉత్తమ కథలు