షాకింగ్..! ఈ వ్యాధి పురుషులకు మాత్రమే సోకుతుందంట...!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎప్పుడు అంతమవుద్దని చూస్తుండగా.. మరో వ్యాధి ముంచుకొస్తున్నదని వైద్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి భారిన పడే బాధితులు పురుషులేనట...!

news18
Updated: October 30, 2020, 2:51 PM IST
షాకింగ్..! ఈ వ్యాధి పురుషులకు మాత్రమే సోకుతుందంట...!!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 30, 2020, 2:51 PM IST
  • Share this:
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణతో సతమతమవుతున్న ఈ సమయంలో శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ను కనుగొన్నారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా నామకరణం చేశారు. ఈ కొత్త వ్యాధి బారిన పడే పురుషుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. దీని భారిన పడితే ప్రాణాలకు ప్రమాదమని పరిశోధకులు పేర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది.  అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కి చెందిన నేషనల్ హ్యుమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NHGRI) శాస్త్రవేత్తలు ఈ కొత్త సిండ్రోమ్ ను కనుగొన్నారు.

యుబిఎ 1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వాక్యూల్స్, ఈ1 ఎంజైమ్, ఎక్స్- లింక్డ్, ఆటో ఇన్ఫ్లమేటరీ అండ్ సోమాటిక్ సిండ్రోమ్(వెక్సాస్)గా పిలుస్తారు. ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  ఇది కేవలం X క్రోమోజోమ్ తో ముడిపడి ఉండటం వల్ల, పురుషుల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, మహిళల అదనపు X క్రోమోజోమ్ వారికి రక్షణగా పనిచేస్తాయని, దీని వల్ల మహిళల్లో ఈ వ్యాధి సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ VEXAS వ్యాధి సోకిన వారికి సిరల్లో రక్తం గడ్డకట్టడం, తరచుగా జ్వరం రావడం, మైలోడెడ్ కణాల్లో వాక్యూల్స్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడం వంటి లక్షణాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో పేర్కొన్నారు.

2,500 మంది రోగులపై అధ్యయనం..
ఈ వ్యాధిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని పాటించారు. ఈ వ్యాధి నిర్థారణకు గాను 2,500 మంది రోగుల జన్యుశ్రేణులపై అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా కొందరిలో యూబీఏ1 అనే జన్యువును వారిలో గుర్తించారు. ఇది వెక్సాస్ అనే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కు కారణమవుతుందని తేల్చి చెప్పారు.

అయితే అన్ని జన్యువుల్లో 2 కాపీలుంటే దీనిలో మాత్రం ఒక్కటే కాపీ ఉందని, అది కూడా ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మిస్టర్ డేనియల్ కాస్ట్నర్ పేర్కొన్నారు. దీని వల్ల ఎక్స్ క్రోమోజోమ్లు కలిగి ఉన్న పురుషుల్లో మాత్రమే వెక్సాస్ సిండ్రోమ్ సోకుతుందని, పురుషుల రక్త కణాలలో జన్యుపరమైన వైవిధ్యత ఉంటేనే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ పరిశోధనలో తేలిన ఫలితాల సహాయంతో మెరుగైన రోగ నిర్థారణ, చికిత్స అందించవచ్చని తెలిపారు. లక్షణాలు ఉన్న రోగులు ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ను సందర్శిస్తున్నారు.

అయితే వైద్యులు వాటిని నిర్ధారించలేకపోయారు. కొత్తగా కనుగొన్న ఈ జన్యు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులలో 40 శాతం మంది ఇప్పటికే దీని నుండి కోలుకున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వంటి ఎన్నో వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా కొత్తగా వెలుగులోకొస్తున్న ఈ కొత్త వ్యాధులు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 30, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading