కొండగట్టు అంజన్న ఆలయంలో అతికొద్ది మంది భక్తుల తో... ప్రత్యేక పూజలు

కోవిడ్ 19 నేపథ్యంలో లాక్ డౌన్ వలన..అతికొద్ది మంది భక్తుల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొండగట్టు అంజన్న ఆలయంలో అతికొద్ది మంది భక్తులతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Share this:
    జగిత్యాల జిల్లా కొండగట్టు :  హనుమాన్ జయంతి పురస్కరించుకుని నేడు మాల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ 19 నేపథ్యంలో లాక్ డౌన్ వలన ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ పద్ధతిలో అతికొద్ది మంది తో యజ్ఞం చేశారు. ఏటా 3 నుండి 4 లక్షల హనుమాన్ భక్తులు, హనుమాన్ మాలలు ధరించి 41 రోజులు దీక్షలు ఉపవాసాలు చేసి హనుమాన్ పెద్ద జయంతి రోజున కొండగట్టు ఆలయనికి వచ్చి మాల విరమణ చేస్తూ వుంటారు కానీ కరోన వైరస్ నేపథ్యంలో భక్తులు ఎవరు ఆలయానికి రాకుండా ఉండాలని ఎక్కడివారు అక్కడే మాల విరమణ చేయాలని ఆలయ అధికారులు సూచించారు. ప్రతియేటా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడా కన్నులపండుగగా జరుపుతువుంటారు. కానీ ఈ సంవత్సరం కరోనా లొక్డౌన్ వల్ల ఇలా కొద్ధి మంది భక్తులతో ఉత్సవం జరిపించవలసి వచ్చిందని ఎక్కడి పూజారులు చెబుతున్నారు.
    Published by:Venu Gopal
    First published: