రాజన్న సిరిసిల్ల జిల్లా: దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో 8వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పక్షంలో సోమవారం నుంచి గంటకు 200 మంది భక్తులకు స్వామివారి లఘుదర్శనం అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్ని యంత్రణలో భాగంగా మార్చి 19 నుంచి రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించి జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలలో భక్తులకు అనుమతించవచ్చని స్పష్టం చేయడంతో భక్తులు ఆలయంలోని కోడెమొక్కులు, దర్శనం క్యూలైన్లలో భౌతికదూరం పాటించే విధంగా దూరం దూరంగా డబ్బాలను గీశారు.
భక్తులను దర్శనానికి అనుమతించే పక్షంలో కేవలం లఘుదర్శనంకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆర్జిత సేవలకు ఇప్పట్లో అవకాశం ఉండబోదని తెలుస్తోంది. రాజన్న ఆలయంలో ప్రత్యేకమైన కోడెమొక్కు సమర్పణ, తలనీలాల సమర్పణతో పాటు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆలయ పరిసరాలను శానిటేషన్ చేయడంతో పాటు థర్మల్ స్ర్కీనింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆలయంలో భక్తులను అనుమతించే అంశంపై ఇంకా తమకు ఆదేశాలు రాలేదని ఆలయ ఏఈవో డి.ఉమారాణి తెలిపారు. అనుమతి లభించిన వెంటనే భక్తులకు దర్శనం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Published by:Venu Gopal
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.