మరికొన్ని రోజులు కష్టపడితే కరోనాను తరిమికొట్టొచ్చు ...వేముల ప్రశాంత్ రెడ్డి

ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే నిజామాబాద్ జిల్లాలో కరోనాను అరికట్టగలిగామన్నారు..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో కరోనా వైరస్, ప్యాడీ, యుజిఎస్ పన్నుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లా: అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లనే కరోనా మహమ్మారిని అరికట్టగలిగామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు... రేపు క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం ప్రకారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో కరోనా వైరస్, ప్యాడీ, యుజిఎస్ పన్నుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, షకీల్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.. అనంతరం మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే నిజామాబాద్ జిల్లాలో కరోనాను అరికట్టగలిగామన్నారు.. జిల్లాలో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. డైరెక్ట్ గా 32, ప్రైమరీ గా 22, సెకండరీగా 5, గల్ఫ్ రిటన్ ఒక్కరు ఉన్నారు.. ఇప్పటికే 41 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లల్లోకి చేరుకున్నారు.. ఇలాగే మరికొన్ని రోజులు అందరం కష్టపడి కరుణ మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని మంత్రి అన్నారు.. వరి ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయి అన్నారు. రైతులెవ్వరు కూడా అధైర్య పడొద్దు చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.. కొనుగోలు విషయంలో అధికారులెవ్వరూ నిర్లక్ష్యం చేయవద్దు... రైస్ మిల్లర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు..
    Published by:Venu Gopal
    First published: