HOME »NEWS »Corona vilayatandavam »vande bharat mission day 2 two special flights from uae with over 350 indians reach chennai mk

Vande Bharat Mission: విజయవంతంగా వందే భారత్...స్వదేశానికి ఎమిరేట్స్ నుంచి 182 మంది రాక...

Vande Bharat Mission: విజయవంతంగా వందే భారత్...స్వదేశానికి ఎమిరేట్స్ నుంచి 182 మంది రాక...
సిడ్నీ నుంచి 4, మెల్‌బోర్న్ నుంచి మరో 4 విమాన సర్వీసులు నడవనున్నాయి.

వందే భారత్ మిషన్ ఊపందుకుంది. ఇప్పటికే ఈ మిషన్ ద్వారా మొదటి దశ పూర్తి కాగా, రెండో దశలో కూడా విజయవంతంగా ప్రారంభమైంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), దుబాయ్ నుంచి రెండు ప్రత్యేక విమానాలు శనివారం చెన్నై చేరుకున్నాయి.

  • Share this:
    కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలలో చిక్కుకున్న వలసదారులను స్వదేశానికి తీసుకురావడానికి వందే భారత్ మిషన్ ఊపందుకుంది. ఇప్పటికే ఈ మిషన్ ద్వారా మొదటి దశ పూర్తి కాగా, రెండో దశలో కూడా విజయవంతంగా ప్రారంభమైంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), దుబాయ్ నుంచి రెండు ప్రత్యేక విమానాలు శనివారం చెన్నై చేరుకున్నాయి. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మొదటి ప్రత్యేక విమానంలో 182 మంది భారతీయ పౌరులతో వచ్చింది. తదుపరి ఎయిర్ ఇండియా IX540 - POB 177 విమానంలో 177 మంది చెన్నై విమానాశ్రయంలో దిగారు. ఇదిలా ఉంటే ప్రజలను విమాన మార్గంతో పాటు, సముద్రం ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నారు. 698 మంది భారతీయులను మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా స్వదేశానికి తీసుకొని వస్తున్నారు.

    ఆపరేషన్ ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవుల్లో చిక్కుకున్న 698 మంది భారతీయ ప్రజలతో స్వదేశానికి తిరిగి వస్తోంది. ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా 698 మందిని సురక్షితంగా వస్తున్నారు, ఇందులో 595 మంది పురుషులు మరియు 103 మంది మహిళలు ఉన్నారు. ఈ 103 మంది మహిళల్లో 19 మంది మహిళలు గర్భిణులు ఉండటం గమనార్హం. మాల్దీవుల రాజధానిలో చిక్కుకున్న 698 మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చే పనిని ఐఎన్ఎస్ జలష్వా ప్రారంభించారు. భారత నావికాదళం ప్రకారం, మాల్దీవుల నుండి తిరిగి తీసుకురాబడిన భారత పౌరులలో 19 మంది గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు.



    మాల్దీవుల్లో చిక్కుకున్న 1,800 నుంచి 2 వేల మంది భారతీయ ప్రజలను సురక్షితంగా తీసుకురావడానికి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మాగర్ ఈ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా, 4 ట్రిప్పులు చేయనున్నారు, ఇందులో 2 కొచ్చి నుండి మరియు 2 టుటికోరిన్ కు సర్వీస్ చేయనున్నారు.

    అయితే మొదటగా సీనియర్ సిటిజన్లు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు. నిరుద్యోగులను భారతదేశానికి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా వాయుమార్గం ద్వారా కూడా ప్రజలను తీసుకువస్తున్నారు. వర్గాల సమాచారం ప్రకారం, వలసదారుల కోసం 12 దేశాల నుండి విమానాలు వస్తున్నాయి, ఈ వారంలో దేశంలోని 14 నగరాల్లో 64 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఈ విమానాలు చిన్న విమానాశ్రయాలలో కూడా ల్యాండ్ అవుతాయి మరియు ప్రజలు తమ ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో అడుగుపెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు 4 ప్రత్యేక రివర్షన్ విమానాలు దేశంలో ల్యాండ్ అయ్యాయి. 181 మరియు 182 మంది ప్రయాణికులతో 2 నౌకలు దుబాయ్ నుండి వచ్చాయి. కాగా, సింగపూర్ నుండి 234 మంది ప్రయాణికులు విమానం భారతదేశానికి చేరుకుంది.

    అలాగే గల్ఫ్ దేశాల నుండి 27, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి 11, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుండి 7, ఆగ్నేయాసియా నుండి 14, యుఎస్ లోని 4 విమానాశ్రయాల నుండి 7 విమానాలు మరియు లండన్ నుండి 7 విమానాలు భారతదేశానికి బయలుదేరబోతున్నాయి.
    Published by:Krishna Adithya
    First published:May 09, 2020, 09:02 IST