భారత్‌పై ఐక్యరాజ్య సమితి ప్రశంసల జల్లు కురిపించింది. భారీ స్థాయిలో కరోనా టీకాలను ఉత్పత్తి చేయలగల భారత్ సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ మాట్లాడారు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు భారత్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. అక్కడ దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్‌ల గురించి తమకు తెలుసన్న ఆంటోనియో.. ఆయా టీకా తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యస సమితి అభిప్రాయపడ్డారు.
We strongly hope that India will have all the instruments that are necessary to play a major role in making sure that a global vaccination is campaign is made possible: UN Secretary-General Antonio Guterres https://t.co/aPrBi9PcNb
— ANI (@ANI) January 28, 2021
ఇటీవలే భారత్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసలు కురిపించింది. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు సాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోదీకి WHO డీజీ డెడ్రోస్ గ్యాబ్రియేసస్ ధన్యవాదాలు తెలిపారు. ఒకరికొకరం సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పోరాడితేనే వైరస్‌ను నిర్మూలించగలుగుతామని.. ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడలుగుతామని పేర్కొన్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుందంటే.. కరోనా వ్యాక్సినేషన్‌లో భారత పాత్రేంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్‌లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు మనదేశం ఉచితంగానే టీకాను అందజేస్తోంది. బ్రెజిల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాలకు టీకాలను పంపిస్తోంది. త్వరలోనే ఒమన్, నికరాగ్వా, కరీబియన్ దేశాలతో పాటు పసిఫిక్ దేశాలకు కూడా టీకా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాదు ఆఫ్రికాకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని, ఐక్యరాజ్య సమితికి 10 లక్షల డోస్‌లను ఇస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, Covishield