Home /News /coronavirus-latest-news /

Covid 19 Vaccination: సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి టీచ‌ర్లంద‌రికీ టీకా..

Covid 19 Vaccination: సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి టీచ‌ర్లంద‌రికీ టీకా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం (National Teachers Day) సెప్టెంబ‌ర్ 5 వ తేదీ క‌ల్లా దేశంలో ఉపాధ్యాయుల అంద‌రికీ టీకా ఇచ్చేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి(Minister of Health and Family Welfare) మన్సుఖ్ మాండవియా వెల్ల‌డించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ చూపాల‌ని ఆయ‌న కోరారు.

ఇంకా చదవండి ...
    జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం (National Teachers Day) సెప్టెంబ‌ర్ 5 వ తేదీ క‌ల్లా దేశంలో ఉపాధ్యాయుల అంద‌రికీ టీకా ఇచ్చేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్ల‌డించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ చూపాల‌ని ఆయ‌న కోరారు. ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయుల‌ను గౌర‌వించాల‌ని ఆయ‌న అన్నారు. ఈ నెల ప్ర‌ణాళిక ప్ర‌కారం రెండు కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ డోస్‌లు(Vaccine Doses)  ఈ నెల‌లో అందుబాటులో ఉంచిన‌ట్టు ఆయ‌న తెలిపారు.
    ఈ ల‌క్ష్యాన్ని విజ‌యంతం చేయాల్సిన గురుత‌ర బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఉంద‌ని అన్నారు. క‌రోనా నుంచి భ‌విష్య‌త్ త‌రాల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని మంత్రి అన్నారు. పిల్ల‌ల‌తో పాటు వారి అధ్యాయ‌నానికి అవ‌స‌ర‌మైన అడ్డంకుల‌ను తొల‌గించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని అన్నారు. ఈ అంశంపై నిర్మాణాత్మంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ద్ద‌తు అవ‌స‌రం అని ఆయ‌న పేర్కొన్నారు. కోవిడ్ పోరాటంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు.

    Online Class: మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న యూనిసెఫ్


    క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మార్చి, 2020 నుంచి దేశ వ్యాప్తంగా పాఠ‌శాల‌లు మూసివేయ‌బ‌డ్డాయి. అప్ప‌టి నుంచి విద్యార్థులకు ప్ర‌భుత్వం ఆన్‌లైన్ ద్వారానే బోధన అందిస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా స‌రైన ఇంట‌ర్‌నెట్ (Internet Connection) క‌నెక్ష‌న్ లేక‌పోడం కార‌ణంగా చాలా మంది విద్యార్థులు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు విన‌లేకపోయారు. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య కార‌ణంగా చాలా మంది చ‌దువుకు దూర‌మ‌య్యారు. ఈ ప్ర‌భావం వారి భ‌విష్య‌త‌పై ప‌డే అవ‌కాశం ఉంది. ఉపాధ్యాయులే చొర‌వ చూపి విద్యార్థుల భవిష్య‌త్‌ను కాపాడ‌గ‌ల‌రు.
    ఇంకా క‌రోనా మూడో వేవ్(Third Wave)  భ‌యాలు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం 18 ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులో లేవు. అదే స‌మ‌యంలో తిరిగా పాఠ‌శాల‌లు తెర వాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ స‌మ‌యంలో ఉపాధ్యాయుల‌కు టీకాలు వేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని తీసుకొంది.
    ఇత‌ర దేశాల్లో పిల్ల‌ల‌కు టీకాలు..
    అమెరికా, కెనాడా, సింగ‌పూర్ దేశాల్లో పిల్ల‌ల‌కు టీకాలు వేయ‌డానికి ఆయా దేశాల ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపారు. ఇండియాలో ఇంకా 18 లోపు వారికి టీకా వేయ‌డం లేదు. దీనికి సంబంధించిన విధానాన్ని ప్ర‌భుత్వం రూపొందించ‌లేదు. ఈ స‌మ‌యంలో పాఠ‌శాల‌లు తెర‌వ‌డం పిల్ల‌ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Covid vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు