కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. భార్య మరణించిన కొన్ని రోజులకే..

ఉత్తరాఖండ్‌లో వెరటన్ యూత్ లీడర్‌గా ఆయనకు మంచి పేరుంది. జీనా ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

news18-telugu
Updated: November 12, 2020, 9:17 AM IST
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. భార్య మరణించిన కొన్ని రోజులకే..
సురేంద్ర సింగ్ జీనా
  • Share this:
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పలు చోట్ల కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల మరణాలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూశారు. సాల్ట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజుల కింద ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆరోగ్యం క్షీణించంచడతో సురేంద్ర సింగ్ జీనా కన్నుమూశారు.

సురేంద్ర జీనా.. 1969 డిసెంబర్‌ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో ఆయన జన్మించారు. ఉత్తరాఖండ్‌లో వెరటన్ యూత్ లీడర్‌గా ఆయనకు మంచి పేరుంది. జీనా ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లో మొదటి సారి బిక్యాసెన్‌ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం సాల్ట్‌ నియోజవర్గంనుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన భార్య గుండెపోటుతో మరణించారు. అంతలోనే ఎమ్మెల్యే మరణించడంతో సాల్ట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీజేపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 66, 788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . చికిత్స అనంతరం వీరిలో 60, 900 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,086 మంది మరణించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో 4,251 యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 12, 2020, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading