దేశంలో ఒమిక్రాన్ కారణంగా కరోనా మూడో వేవ్ మొదలైంది. కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇదిలా ఉంటే రాబోయే నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ కరోనా వ్యాప్తి ప్రభావం ఆయా రాష్ట్రాలపై ఏ రకంగా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే రాబోయే రోజుల్లో దేశంలో, ఉత్తరప్రదేశ్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి మరింత వేగంగా పెరుగుతుందని.. కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. కనీసం ఒక్క డోసు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోని వారికి ఇది ప్రాణాంతకం అని రుజువు అవుతోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జనవరి చివరి వారంలో కరోనా ఇన్‌ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. జనవరి 15 వరకు ఢిల్లీ, ముంబైలలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని.. జనవరి చివరి వారంలో దేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఈ సమయంలో రోజుకు 8 నుండి 9 లక్షల ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతాయని అన్నారు.
ఎన్నికల వల్ల ఎటువంటి తేడా ఉండదని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. ఇంతకు ముందు కూడా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని.. ఆ తరువాత వైరస్ పెద్దగా వ్యాపించలేదని అన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల పరివర్తనకు మధ్య పెద్దగా తేడా లేదని అన్నారు. కరోనా వైరస్ వల్ల భయపడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒమిక్రాన్ కేసుల్లో 4-5 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరవలసి ఉంటుందని వివరించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న కేసుల తీరు రానున్న కాలంలో ప్రాణాంతకంగా మారుతుందని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి కనిపిస్తోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జనవరి చివరి వారంలో కరోనా మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రొఫెసర్ మనీంద్ర తెలిపారు. తనకు యూపీకి సంబంధించిన పూర్తి డేటా రాలేదని.. తన అంచనా ప్రకారం ఇక్కడ కేసులు మరింతగా పెరుగుతాయని అన్నారు.
Corona Cases: ముంబైలో ఒక్క రోజే 11,647 కేసులు.. 5 శాతం తగ్గిన పాజిటివిటీ రేట్!
Corona Third Wave: ఏపీలో లాక్ డౌన్ తప్పదా..? 5శాతానికి పాజిటివిటీ రేటు.. కొత్తకేసులు ఎన్నంటే..!
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తీరు చూస్తే దేశంలోనే కాకుండా యూపీలో కూడా కేసులు పెరుగుతాయని ఆయన అన్నారు. దేశంలోని డేటా ప్రకారం.. ప్రతిరోజూ 8 నుండి 9 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని అన్నారు. జనవరి 15 నుండి 16 వరకు ఢిల్లీ, ముంబైలో కరోనా థర్డ్ వేవ్ పీక్‌కు చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ఈ సమయంలో ముంబై కంటే ఢిల్లీలో ఎక్కువ కేసులు వెలుగు చూసే అవకాశం ఉందని అన్నారు. ఢిల్లీలో రోజుకు 70 వేల కేసులు నమోదవుతున్నాయని... ముంబైలో ప్రతిరోజూ 60 వేల కొత్త కేసులు బయటపడుతున్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.