క్వారంటైన్ సెంటర్ లోనే ప్రసవించిన తల్లి...బిడ్డపేరు కోవిడ్...

నిండు గర్భిణీగా ఉన్న ఆమె క్వారంటైన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన బాబుకు ఆ దంపతులు కోవిద్ పేరు పెట్టారు.

news18-telugu
Updated: April 8, 2020, 12:13 AM IST
క్వారంటైన్ సెంటర్ లోనే ప్రసవించిన తల్లి...బిడ్డపేరు కోవిడ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫరీదాబాద్‌లో ఓ హోటల్‌లో పని చేసే నేపాల్‌కు చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి స్వగ్రామం వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని క్వారంటైన్‌ సెంటర్ కు తరలించారు. నిండు గర్భిణీగా ఉన్న ఆమె క్వారంటైన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన బాబుకు ఆ దంపతులు కోవిద్ పేరు పెట్టారు. మరోవైపు ఏపీలో సైతం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఇద్దరు చిన్నారులకు కరోనా పేరు పెట్టారు. వేంపల్లె పట్టణంలో పుట్టిన మగ, ఆడ శిశువులకు ఈ వైరస్ పేరుతో నామకరణం చేశారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు. నిన్న వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది.

ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వీరిద్దరికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ఐతే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు డాక్టర్. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో వాటినే ఖరారు చేశారు.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading