ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్... ఎన్ని రోజులంటే...

Uttar Pradesh Lockdown: గడిచిన 24 గంటల వ్యవధిలో ఉత్తరప్రదేశ్‌లో 1188 కరోనా కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: July 9, 2020, 9:45 PM IST
ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్... ఎన్ని రోజులంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమైంది. రేపు రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటలకు 55 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇక అన్‌లాక్ 2 తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న విధంగానే యూపీలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1188 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31156కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9980 ఉండగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20331గా ఉంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 845 మంది చనిపోయారు.



దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తుండగా... మరికొన్ని రాష్ట్రాలు పట్టణాలు, నగరాల్లో కొన్ని రోజుాల పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం రెండు రోజులకు పైగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: July 9, 2020, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading