US SUSPENDS ALL FLIGHTS BY CHINESE AIRLINES INTO AND OUT OF THE COUNTRY STARTING JUNE 16 SK
చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
చైనీస్ అధికారిక మీడియా ఈ కామెంట్ చేసినా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అసలు చైనా నుంచే కరోనా వచ్చిందని, అక్కడి ప్రయోగశాల నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.
తమ విమానాలను చైనాలోకి అనుమతించని నేపథ్యంలో.. చైనా విమానాలను కూడా అమెరికాలో అనుమతించబోమని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని విమర్శలు గుప్పించింది.
అమెరికా, చైనా మధ్య వివాదం ముదురుతోంది. కరోనా వైరస్ తర్వాత ఇరుదేశాల బంధం తీవ్రంగా క్షీణించింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నుంచి రాపోకలు సాగించే అన్ని చైనా విమానాలను నిలిపివేశారు. జూన్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని యూఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఐతే చైనాలోని వుహాన్ సిటిలో ఇప్పటికే లాక్డౌన్ ఎత్తేశారు. అక్కడికి ఇతర దేశాల నుంచి విమానాలను అనుమతించినప్పటికీ.. అమెరికాకు చెందిన యునైటైడ్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థల విమానాలను మాత్రం చైనా అనుమతించలేదు. తమ విమానాలను చైనాలోకి అనుమతించని నేపథ్యంలో.. చైనా విమానాలను కూడా అమెరికాలో అనుమతించబోమని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని విమర్శలు గుప్పించింది.
#BREAKING US suspends all flights by Chinese airlines into and out of the country starting June 16: Transportation Dept. pic.twitter.com/ank0nXM6wL
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.