అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా పరీక్ష... ఏం తేలిందంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా పరీక్ష... ఏం తేలిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో ఇప్పటి వరకు 12,69,025 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 2,13,113 మంది కోలుకోగా... 75,490 వేల మంది మరణించారు.

  • Share this:
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివసించే వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేగింది. శ్వేత సౌధంలో పనిచేసే అమెరికా మిలటరీ సిబ్బందికి కోవిడ్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనతో దగ్గరగా మెలిగిన వారందరినీ క్వాంరటైన్ చేసి పరీక్షలు చేశారు. అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కూడా కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. రిపోర్టుల్లో వీరిద్దరికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

    కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 12,69,025 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 2,13,113 మంది కోలుకోగా... 75,490 వేల మంది మరణించారు. ప్రస్తుతం అమెరికాలో 9,80,422 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 15,827 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కరోనా గణాంకాలు చెబుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: