కరోనా వైరస్‌ను కావాలని అంటిస్తే... వారికి విధించే శిక్ష ఏంటంటే...

కరోనా వైరస్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరికి అంటిస్తే వారి మీద ఉగ్రవాద చట్టం కింద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించింది.

news18-telugu
Updated: March 25, 2020, 6:11 PM IST
కరోనా వైరస్‌ను కావాలని అంటిస్తే... వారికి విధించే శిక్ష ఏంటంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరొకరికి అంటిస్తే వారి మీద ఉగ్రవాద చట్టం కింద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. ‘కావాలని కోవిడ్ 19ను పొరుగువారికి అంటిస్తే వారిపై టెర్రరిస్ట్ నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోండి.’ అని న్యాయ శాఖ ఉన్నతాధికారులు పోలీసు శాఖ, అమెరికా అటార్నీలకు డిప్యూటీ అటార్నీ జనరల్ జఫ్రీ రోజెన్ ఇచ్చిన మెమోలో తెలిపారు. ప్రాసిక్యూటర్లు, విచారణ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఓ రకంగా టెర్రరిజాన్ని పోలి ఉంటుంది. కరోనాను అంటిస్తామని బెదిరించడం లేదా, అంటించడం చేసినా, అమెరికా మీద దాన్నో ఆయుధంగా ప్రయోగించాలని చూసిన వారిని వదిలిపెట్టేది లేదు.’ అని ఆ మెమోలో తెలిపారు. అయితే, ఇప్పటి వరకు అలాంటి ఉద్దేశపూర్వకంగా అంటించిన కేసులు ఏమైనా ఉన్నాయా? లేదా? అనేది మాత్రం తెలియజేయలేదు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, ధరలను నియంత్రించేందుకు, అత్యవసర సరుకులు సరఫరా చేసేందుకు న్యాయశాఖ ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా భారీ ఎత్తున మాస్క్‌లను బ్లాక్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు